ఫ్యాషన్ డిజైనర్..లేడీస్ టైలర్ సీక్వెల్ గా ఎప్పుడో తనికెళ్లభరణి లైన్ అల్లి రెడీ చేసిన సబ్జెక్ట్. అలా అలా చేతులు మారి ఇప్పుడు మధుర శ్రీధర్ దగ్గరకు వచ్చింది. సీనియర్ వంశీ డైరక్ట్ చేస్తా అన్నాడు. రాజ్ తరుణ్ హీరో అనుకున్నారు. అంతవరకు బాగానే వుంది. కానీ కథ చెప్పండి వివరంగా అని హీరో అడిగే సరికి సమస్య వచ్చి పడింది.
వారం,,రెండు వారాలు, మూడువారాలు గడిచిపోయాయి. వంశీ స్క్రిప్ట్ వండే ప్రయత్నాలు సాగిస్తున్నారని వినికిడి. అయితే తాజా ఖబర్ ఏమిటంటే, స్క్రిప్ట్ వంటకం వంశీ వల్ల కాలేదని, అందుకే మచ్చ రవిని తొడు తీసుకున్నారని. ఇప్పుడు మచ్చ రవి ఫ్యాషన్ డిజైనర్ స్క్రిప్ట్ వంటకంలో ఫుల్ బిజీ అని. అది కావాలి..అప్పుడు హీరో విని ఓకె చేయాలి.