గరుడ సమస్త హక్కులు సాయికే

రాజమౌళి తరువాతి వెంచర్ గరుడ అని ఇండస్ట్రీలో టాక్ ఎప్పుడో స్ప్రెడ్ అయిపోయింది. దాని కథ కమామిషు, ఎవరు వుంటారు..ఏమిటి అన్నది ఇంకా డిసైడ్ కాలేదు కానీ, ఓపని మాత్రం జరిగిపోయింది. ఆల్ ఇండియా…

రాజమౌళి తరువాతి వెంచర్ గరుడ అని ఇండస్ట్రీలో టాక్ ఎప్పుడో స్ప్రెడ్ అయిపోయింది. దాని కథ కమామిషు, ఎవరు వుంటారు..ఏమిటి అన్నది ఇంకా డిసైడ్ కాలేదు కానీ, ఓపని మాత్రం జరిగిపోయింది. ఆల్ ఇండియా వైజ్ గా, ఆల్ లాంగ్వేజస్, మూవీ, టీవీ, విడియో కంటెంట్, ఇలా ఎక్కడపడితే అక్కడ గరుడ టైటిల్ కేవలం  వారాహి చలన చిత్రకు మాత్రమే వుండేలా రిజిస్ట్రేషన్ చేసేసారు. 

అంటే గరుడ టైటిల్ ను టీవీ, సినిమా, విడియో మాధ్యమాల్లో ఎవరూ వాడకూడదన్నమాట. బాహుబలి తరువాత వారాహి బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమా ఇదే అని వినికిడి. అందుకే ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు.