ఈ సమ్మర్ సీజన్ లో కాస్తోకూస్తో హైప్ తో వచ్చిన సినిమాలన్నీ ఆడాయి. చివరికి వెంకటాపురం లాంటి చిన్న సినిమాకు కూడా డబ్బులు వచ్చాయి. కానీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా ఫ్యాషన్ డిజైనర్. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వీకెండ్ ముగిసేసరికి అటు టాక్ పరంగా, ఇటు వసూళ్ల పరంగా డిజాస్టర్ అనిపించుకుంది.
దాదాపు 30 ఏళ్ల కిందట వచ్చిన లేడీస్ టైలర్ కు సీక్వెల్ గా ఫ్యాషన్ డిజైనర్ తీశారు. అయితే టేకింగ్, డైలాగ్స్, స్క్రీన్ ప్లేలో మాత్రం అప్పటి లేడీస్ టైలర్ జమానాలోనే ఆగిపోయారు. చివరికి కామెడీ కూడా 30ఏళ్ల కిందటిదే. ఇలాంటి సినిమా ఆడుతుందని ఎవరూ అనుకోరు. చివరికి అదే జరిగింది. శని, ఆదివారాలే డల్ గా నడిచిన ఈ సినిమాకు ఇవాళ్టి నుంచి వసూళ్లు రావడం చాలా కష్టం.
ఈ సమ్మర్ సీజన్ లో ఇప్పటివరకు మిస్టర్, రోగ్, బాబు బాగా బిజీ సినిమాలు అంచనాల మధ్య వచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి ఫ్యాషన్ డిజైనర్ కూడా చేరిపోయింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మనాలీ రాధోడ్, అనీషా ఆంబ్రోస్, మానస హీరోయిన్లు.