రజనీకాంత్‌ సర్వేలో ఏం తేలింది.!

మొన్నీమధ్యనే అభిమానులతో కలిసి సమావేశమయ్యారు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. ఆ భేటీ వెనుక 'పెద్ద రాజకీయమే' వుందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. రాజకీయాల్లోకి వచ్చేందుకోసం ముందస్తు ప్రిపరేషన్స్‌ కోసం అభిమానుల సూచనల్ని, సలహాల్ని, వారి…

మొన్నీమధ్యనే అభిమానులతో కలిసి సమావేశమయ్యారు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. ఆ భేటీ వెనుక 'పెద్ద రాజకీయమే' వుందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. రాజకీయాల్లోకి వచ్చేందుకోసం ముందస్తు ప్రిపరేషన్స్‌ కోసం అభిమానుల సూచనల్ని, సలహాల్ని, వారి అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు 'అభిమానులతో సమావేశాన్ని' వేదికగా రజనీకాంత్‌ మార్చుకున్నారు. 

'అబ్బే, రాజకీయాల గురించిన ఆలోచన లేదు..' అని సమావేశాల మొదటి రోజు సెలవిచ్చిన రజనీకాంత్‌, 'యుద్ధానికి సిద్ధంగా వుండండి..' అంటూ చివరి రోజున పొలిటికల్‌ ఎంట్రీపై దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. జులై నెలలో రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ వుంటుందని ఇటీవలే ఆయన సోదరుడు ప్రకటించిన విషయం విదితమే. మరోపక్క, రజనీకాంత్‌ తన పొలిటికల్‌ ఎంట్రీపై ఓ సర్వే చేయించుకున్నారట. ఆ సర్వే దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 

కేవలం అభిమానులతోనే కాకుండా, సాధారణ ప్రజానీకాన్నీ ఈ సర్వేలో పాల్గొనేలా పక్కా స్కెచ్‌తో రంగంలోకి దూకింది ఓ బృందం. కొంతమంది మీడియా ప్రతినిథులతో కలిసి అత్యంత రహస్యంగా ఈ సర్వే నిర్వహించారట. 80 శాతానికి పైగా సర్వే పూర్తయ్యిందని తెలుస్తోంది.

ఈ సర్వేల్లో, రజనీకాంత్‌ స్థానికతపై వ్యతిరేకత బాగానే వ్యక్తమయ్యిందట. ఎప్పటికప్పుడు సర్వే ఫలితాల్ని తెప్పించుకుంటున్న రజనీకాంత్‌, స్థానికతపై ఎదురీతకుగాను తీసుకోవాల్సిన చర్యలపై అత్యంత సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. 

తన రాజకీయ రంగ ప్రవేశంపై మొదటి నుంచీ రజనీకాంత్‌ వెనకడుగు వేస్తున్న ఈ 'స్థానికత' వివాదం కారణంగానే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

కొసమెరుపు: సినిమాల్లోనే కొనసాగాలా.? రాజకీయాల్లోకి వెళ్ళాలా.? ఓ వైపు సినిమాల్ని ఇంకో వైపు రాజకీయాల్ని బ్యాలెన్స్ చేయొచ్చా.? ఏ పార్టీతో కలిసి పనిచేయాలి.? ఇలాంటి ప్రశ్నలతో రజనీకాంత్ పొలిటికల్ సర్వే జరిగిందట.