అంతకుముందు చిన్న చిన్న పాత్రల్లో చేసినా.. ‘ప్రస్థానం’ సినిమాలో చేసిన రోల్ తో రష్మీకి మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ‘జబర్దస్త్’తో ఈ అమ్మడి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. హాట్ యాంకర్ గా నిలిచి ఆకట్టుకుంటోంది. వరసగా సినిమా ఆఫర్లను కూడా సొంతం చేసుకుంటోంది. మరి ఇప్పుడు టీవీ చానళ్లు బతికేస్తున్నాయంటే దానికి రష్మీ వంటి వాళ్లే ఆధారం అయిపోయారు. ఆఖరికి సినిమా వాళ్లు కూడా ఈ టీవీ యాంకర్లను కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యులు చేసేస్తున్నారు.
తాజాగా దగ్గుబాటి రానా టాక్ షోకి రష్మీ అతిథిగా వచ్చింది. తెలుగులో మిగతా టాక్ షోలతో పోలిస్తే రానా షో బోల్డ్ అని చెప్పాలి. ఎలాగూ దీనికి స్పాన్సర్స్ ఒక మద్యం కంపెనీ వాళ్లు కాబట్టి.. ఈ షోకే కొంచెం బోల్డ్ ఇమేజ్ వచ్చింది. అందుకే రానా కూడా కొన్ని హాట్ కొశ్చన్స్ సంధిస్తుంటాడు. ఈ క్రమంలో రష్మీని ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగాడు. మీ మొదటి ముద్దు ఎప్పుడు పెట్టుకున్నారు.. అనేది ప్రశ్న. అమ్మనో, నాన్ననో పెట్టుకుంటాను అని తప్పించుకోవడానికి కుదరదు అనేది షరతు. ఇలాంటివి బయటకు చెప్పుకోవడానికి రష్మీ పెద్దగా వెనుకాడే టైపుకాదు కదా.. అందుకే చెప్పేసింది.
14వ యేటే తను ఫస్ట్ కిస్ రుచి చూశానని రష్మీ చెప్పింది. ఏమనిపించింది అంటే.. ఏదో ఎగ్జయిట్ మెంట్ కొద్దీ, ఎక్స్పెరిమెంటల్ గా ఆ ముద్దు పెట్టుకున్నాను అని రష్మీ వివరించుకొచ్చింది. అయితే ఆ ముద్దు ఎవరికో మాత్రం చెప్పలేదు. ఆ మధ్య ఒక సినిమాలో ముద్దులతో రెచ్చిపోయిన రష్మీ తొలిముద్దు కథ అదట!