వెంకయ్య లీలలు మరీ ఇన్నా?

భోపాల్ లో అతి తక్కువ ధరకు 20 ఎకరాల భూమి భాజపా అనుబంధ ట్రస్ట్ కు అప్పగింత Advertisement హైదరాబాద్ లో స్వర్ణభారతి ట్రస్ట్ కు సిటీ కార్పొరేషన్ రెండు కోట్లకు పైగా మినహాయింపులు…

భోపాల్ లో అతి తక్కువ ధరకు 20 ఎకరాల భూమి భాజపా అనుబంధ ట్రస్ట్ కు అప్పగింత

హైదరాబాద్ లో స్వర్ణభారతి ట్రస్ట్ కు సిటీ కార్పొరేషన్ రెండు కోట్లకు పైగా మినహాయింపులు

వెంకయ్య కుమారుడి షో రూమ్ నుంచి తెలంగాణ పోలీసులకు భారీగా వాహనాల కొనుగోలు

ఇవన్నీ ఉపరాష్ట్రపతి కాబోతున్న వెంకయ్య నాయుడుపై కాంగ్రెస్ సంధించిన ఆరోపణాస్త్రాలు

నిజానికి స్వర్ణభారతి ట్రస్ట్ కు ఆంధ్రలోని విజయవాడ, విశాఖల్లో, తెలంగాణలో హైదరాబాద్ ల్లో కూడా తెలుగు ప్రభుత్వాలు బాగానే సహకరించాయి. ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాయని గుసగుసలు వున్నాయి. కానీ, ఇక్కడ మీడియా అలాంటివి ఏవీరాయదు కదా. 

నిజానికి స్వర్ణభారతికి ప్రభుత్వాలు ఏం చేసాయన్నది కాదు తెలియాల్సింది. అసలు విరాళాలు గతంలో వెంకయ్య మంత్రిగా వున్నపుడు, ఇప్పుడు మంత్రిగా వున్నపుడు ఎవరెవరు ఇచ్చారు? అవి ఎలా ఖర్చు చేసారు అన్నది తెలియాలని గతంలోనే క్వశ్చన్లు వినిపించాయి. కానీ ఎప్పుడు ఖండనలే కానీ, అసలు విషయాలు బయటపెట్టిన దాఖలాలు లేవు.

ఇప్పుడు కూడా వెంకయ్య ఏమంటున్నారు? ఇలా భూములు తక్కువ ధరకు ఇవ్వడం, మినహాయింపులు ఇవ్వడం అన్ని ట్రస్ట్ లకు జరిగేదే, తన కుమార్తె ట్రస్ట్ కు ప్రత్యేకంగా జరిగింది కాదు అంటున్నారు. అంటే అన్ని ట్రస్ట్ ల్లాంటిదే తన కుమార్తె ట్రస్ట్ కూడా అంటున్నారన్నమాట.

పాపం, క్రియాశీలక రాజకీయాల్లోంచి మంచిగా వెళ్లకుండా మచ్చలతో వెళ్తున్నట్లున్నారు వెంకయ్య.