భారీ సినిమాల ఈక్వేషన్లు మారిపోతున్నాయి. యాభైకోట్లు పెడితే కానీ ఓ భారీ సినిమా తెరమీదకు రావడం లేదు. దసరాకు విడుదలవుతున్న మూడు సినిమాల్లో రెండు సినిమాలు అయితే యాభై కోట్ల బడ్జెట్ ను దాటేసాయి.
బరిలో దిగుతున్న మూడో సినిమా పైసా వసూల్ బడ్జెట్ కూడా 46కోట్లు దాటేసింది. బాలకృష్ణ హీరోగా, పూరిజగన్నాధ్ డైరక్షన్ లో తయారవుతున్న సినిమా ఇది. నిజానికి పూరి సినిమాలను కాస్త బడ్జెట్ లోనే తీస్తారు. బాలయ్య సినిమాలు కూడా నలభై లోపు రేంజ్ లోనే తయారవుతాయి.
కానీ మారుతున్న టెక్నాలజీ, జనాలు కోరుకుంటున్న భారీతనం, విదేశాల్లో ఎక్కువ కాలం షూట్ చేయడం వల్ల బడ్జెట్ సర్రున ఎగబాకేసింది. అది కూడా ఇంకా వడ్డీలు కలుపుకోకుండానే. అయితే ఇప్పటికే శాటిటైట్ అన్నీ కలుపుకుని 8కోట్ల వరకు వచ్చేసింది. డిజిటల్ రైట్స్, అదర్ లాంగ్వేజెస్, థియేటర్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఎలా చూసుకున్నా ఫ్రాఫిటబుల్ వెంచరే.
సినిమాను జస్ట్ టీజర్ ద్వారా ఎలా వుంటుందో చూపించి, అప్పుడు సేల్స్ కౌంటర్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు నిర్మాత. ఇప్పటికి ఇంకా అలాగే వుంచారు. 28న ఉదయం 10.10 కి టీజర్ బయటకు వదిలే ముహుర్తం డిసైడ్ చేసారు. అలాగే సెకెండ్ వీక్ లో అడియో ఫంక్షన్ వుంటుంది.