Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫ్లోర్ల నిర్మాణంపై మెగా కన్ను?

ఫ్లోర్ల నిర్మాణంపై మెగా కన్ను?

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త ఆలోచన షూటింగ్ కోసం ఫ్లోర్ల నిర్మాణం.  థియేటర్ల కన్నా ఫ్లోర్లకే ఆదాయం ఎక్కువ అన్న పాయింట్ ఇప్పుడు రన్ అవుతోంది. ఓ ఫ్లోర్ వుంటే వారానికి ఎలా లేదన్నా మూడు  నుంచి అయిదు లక్షల ఆదాయం కిట్టుబాటు అవుతోందట. అదే థియేటర్ అయితే అంత రాదు. 

కానీ అలా అని ఫ్లోర్ల వ్యాపారం అందరికీ సాధ్యం కాదు. ఇండస్ట్రీ మీద కాస్తయినా పట్టు వుండాలి. పట్టు సంగతి అలా పెడితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్లోర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఫ్లోర్ వుంటే రోజుకు 75 వేల వరకు రెంట్ వస్తుంది. పైగా జస్ట్ స్పెస్ రెంట్ కు ఇవ్వడమే. మిగిలిన ఖర్చు కరెంట్ తో సహా అన్నీ దాన్ని రెంట్ కు తీసుకున్నవారిదే. 

నానక్ రామ్  రామానాయుడు మూత పడుతూ వుండడం, గేమ్ షోలు విపరీతంగా పెరిగి చిన్న ఫ్లోర్ల అవసరం పెరగడం, ఆర్ ఎఫ్ సి దూరం, ప్లస్ దానికి ఇతర భాషల నుంచి తాకిడి వుండడం, ఇవన్నీ కలిసి లోకల్ గా ఫ్లోర్ లు వుంటే బెటర్ అని ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. 

అందుకే మాల్, మల్టీప్లెక్స్ కడదామని ఆలోచనతో వుంచిన స్థలంలో అల్లు అరవింద్ ఫ్లోర్ల నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు ఇదే ఆలోచన మరి కొంత మంది చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో స్టూడియో ఆలోచన మదిలో వున్న మెగాస్టార్ చిరంజీవి కూడా మూడు నాలుగు ఫ్లోర్లను నిర్మించే ఆలోచన చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి స్టూడియో ఆలోచన ఆయనలో చాలా కాలం నుంచి వుంది. కానీ స్టూడియో అంటే అది చాలా పెద్ద వ్యవహారం. టైమ్ పడుతుంది. అదే ఫ్లోర్ లు వేయడం అంటే అంత సమయమూ పట్టదు. స్టూడియో అంత ఖర్చూ కాదు. అందుకే ఆ దిశగా ఇండస్ట్రీ జనాలు పలువురు ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకెన్ని రహస్య జీవోలు, వ్యవహారాలున్నాయో 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?