'అఆ'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నితిన్‌కి ఆ తర్వాత ఏదీ కలిసి రావడం లేదు. 'లై'లాంటి భారీ చిత్రం డిజాస్టర్ అయింది. పవన్, త్రివిక్రమ్ పేర్లు పెట్టి మార్కెట్ చేసినా 'ఛల్ మోహన్ రంగ' పెద్ద ఫ్లాప్ అయింది. దిల్ రాజు బ్యానర్, 'శతమానం భవతి' డైరెక్టర్ వున్నా శ్రీనివాస కళ్యాణం అట్టర్‌ఫ్లాప్ అయింది. వరుసగా మూడు భారీ పరాజయాలతో నితిన్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది.
ఈ టైమ్‌లో 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుములతో 'భీష్మ' అనే చిత్రానికి నితిన్ రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయకిగా రష్మిక మందాన నటిస్తుందని సమాచారం. 'గీత గోవిందం'తో యూత్‌కి మరింత దగ్గరయిన రష్మిక ఇప్పుడు ఫుల్ డిమాండ్‌లో వుంది. వరుసగా రెండు బ్లాక్‌బస్టర్లలో నటించిన రష్మిక చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి.
తెలుగులో తొలి అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడి సినిమా కావడంతో ఇంత బిజీలోను 'భీష్మ' కోసం ఆమె తీరిక చేసుకుందట. హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత హిట్ డైరెక్టర్, బ్లాక్‌బస్టర్ హీరోయిన్ తన సినిమాకి పని చేయడం కంటే నితిన్ కోరుకునేది వుండదు. ఈమధ్య తిరగబడ్డ తన అదృష్టం మళ్లీ ఈ కాంబినేషన్‌తో ట్రాక్ మీదకి వచ్చి నితిన్‌ని మళ్లీ టాప్‌లో నిలబెడుతుందా?