సినిమాల్లో ఫట్.. వ్యక్తిగతంగా సూపర్ హిట్

సినిమాల పరంగా శృతిహాసన్ కు ఈ ఏడాది బొత్తిగా కలిసిరాలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చెరొక సినిమా చేసిన ఈ బ్యూటీ.. ఏ లాంగ్వేజ్ లోనూ క్లిక్ అవ్వలేకపోయింది. అటు వ్యక్తిగతంగా మాత్రం…

సినిమాల పరంగా శృతిహాసన్ కు ఈ ఏడాది బొత్తిగా కలిసిరాలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చెరొక సినిమా చేసిన ఈ బ్యూటీ.. ఏ లాంగ్వేజ్ లోనూ క్లిక్ అవ్వలేకపోయింది. అటు వ్యక్తిగతంగా మాత్రం ఈమె చాలా ఖుషీగా ఉంది. చాన్నాళ్ల నుంచి క్లోజ్ గా ఉంటున్న బాయ్ ఫ్రెండ్ ను ఈ ఏడాది తన కుటుంబానికి దగ్గర చేసింది.

తెలుగులో కాటమరాయుడు సినిమా చేసింది శృతిహాసన్. అది ఫ్లాప్ అయింది. అంతకంటే ముందు సూర్యతో చేసిన సింగం-3కూడా ఫెయిల్ అయింది. ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ లో చేసిన మరో మూవీ కూడా ఫ్లాప్ అవ్వడంతో.. ఈ ఏడాది ఫెయిల్యూర్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోయింది శృతి.

మరోవైపు వ్యక్తిగతంగా మాత్రం ఆమె మంచి పురోగతి సాధించింది. తన బాయ్ ఫ్రెండ్ కోర్సల్ ను తల్లి సారిక, తండ్రి కమల్ హాసన్ కు సక్సెస్ ఫుల్ గా పరిచయం చేయగలిగింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ తమ రిలేషన్ షిప్ ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. 

2018లో ఆమె ఏం చేయబోతోందనేది ఇప్పుడు అందర్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 31ఏళ్ల శృతిహాసన్, మైకేల్ కోర్సల్ ను పెళ్లి చేసుకుంటుందని కొందరంటున్నారు. మరికొందరు మాత్రం మరోసారి సినిమాలతో బిజీ అవుతుందని అంటున్నారు. అటు వచ్చే ఏడాదికి సంబంధించి శృతిహాసన్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కమల్ హాసన్ మధ్యలో వదిలేసిన శభాష్ నాయుడు తప్ప.