శర్వానంద్ ఫ్లాప్ లైనప్ లో వున్నాడు. సుధీర్ వర్మ సినిమా విడుదలై ఆదుకోవాల్సి వుంది. ఆ తరువాత ఒక సినిమా ఫినిషింగ్ కు, రెండు సినిమాలు టేకాప్ కు రెడీగా వున్నాయిు. అందువల్ల శర్వాది మంచి పొజిషన్ నే. దర్శకుడు చందు మొండేటిది కూడా అదే పరిస్థితి. సవ్యసాచి లాంటి అరివీరభయంకర డిజాస్టర్ ఇచ్చాడు. ఆ తరువాత మరోదారి లేక నిఖిల్ కార్తికేయ 2కి సైన్ చేసాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే, చేస్తున్న మూడు సినిమాల తరువాత చందు మొండేటికి శర్వా ఓకే చెప్పాడని.
96 రీమేక్, తమిళ తెలుగు సినిమా, 14 రీల్స్ సినిమా అయిన తరువాత సంగతి ఇది. అది కూడా చందు మొండేటి – నిఖిల్ కార్తికేయ2 పూర్తికావాలి. ఇక్కడ కండిషన్లు ఏమిటంటే, శర్వా చేస్తున్న సినిమాలు అన్నీ మంచిగా ఆడాలి. అప్పుడు పెద్ద డైరక్టర్లు శర్వా వెనుక పడతారు. మరి అప్పుడు కూడా చందుమొండేటికి ఒకే అంటాడా? కార్తికేయ2 మాంచి హిట్ అయితే అంటాడేమో?
అంతవరకు ఈ వార్త ఇలా గ్యాసిప్ గా వినిపిస్తూ వుంటుంది.