మరోసారి ‘మూగ మనసులు’

మూగమనసులు సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయిన అనేకానేక సినిమాల్లో ఒకటి. ఈ టైటిల్ లో ఇప్పుడు మరో సినిమా వస్తోంది. మీడియం సినిమాలు వరుసగా నిర్మిస్తూ వస్తున్న సితార ఎంటర్ టైన్…

మూగమనసులు సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయిన అనేకానేక సినిమాల్లో ఒకటి. ఈ టైటిల్ లో ఇప్పుడు మరో సినిమా వస్తోంది. మీడియం సినిమాలు వరుసగా నిర్మిస్తూ వస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ టైటిల్ తో సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో సౌజన్య అనే కొత్త మహిళా దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. చిరకాలంగా అవకాశం కోసం చూస్తోందీమె. మీడియం రేంజ్ హీరోలు చాలామంది డేట్స్ కోసం ట్రయ్ చేసారు కానీ, సెట్ కాలేదు. తమిళంలో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటూ, ఇటీవలే జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హరీష్ కళ్యాణ్ ఈ సినిమాలో హీరో.

త్వరలో ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది. ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ రణరంగం సినిమా నిర్మించి, విడుదలకు రెడీ చేస్తోంది. వెంకీ కుడుమల-నితిన్ సినిమా వచ్చేవారం సెట్ మీదకు వెళ్తోంది. ఇవికాక మరో రెండు ప్రాజెక్టుల కోసం యంగ్ డైరక్టర్లతో డిస్కషన్లు సాగిస్తోంది. 

రిలేషన్ షిప్స్ లో సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఇవి!