‘చిన్నదాన నీకోసం’ చిత్రానికి వచ్చిన టాక్‌కి ఈసారి నితిన్‌కి పరాభవం తప్పదనే అనుకున్నారు. కానీ కాలం కలిసి వచ్చినప్పుడు ఎలాంటి సినిమా చేసినా, ఎంత బ్యాడ్ టాక్ వచ్చినా కానీ సేఫ్ అయిపోవచ్చని ఈ చిత్రం నిరూపించింది. ‘ఇష్క్’కి ముందు ఏడేళ్లకి పైగా హిట్లు లేక ఇబ్బందులు పడ్డ నితిన్‌కి ఇప్పుడు టైమ్ నడుస్తోంది.
‘హార్ట్ ఎటాక్’ చిత్రం యావరేజ్ అనిపించుకుంటే… ‘చిన్నదాన నీకోసం’ దాని కంటే బెటర్‌గా కలెక్ట్ చేసింది. పదహారు కోట్ల బిజినెస్ జరిగిన ఈ చిత్రం ఫుల్ రన్లో పదిహేను కోట్ల షేర్ సాధించింది. దీంట్లో సింహ భాగం నైజాం నుంచే వసూలైంది. ఈ కారణంగా మిగతా ఏరియాల్లో బయ్యర్లు స్వల్పంగా నష్టపోయినా కానీ మొదటి రోజు వచ్చిన టాక్‌కి, ఫైనల్‌గా వచ్చిన కలెక్షన్లకి వారంతా హ్యాపీనే అనుకోవాలి.
ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలతో వచ్చిన గుడ్‌విల్ ఆ తర్వాత వచ్చిన తన రెండు చిత్రాలకి హెల్ప్ అయింది. అలా అని నితిన్ ఇలాంటి నాసిరకం సినిమాలు చేస్తూ పోతే మళ్లీ ఇబ్బంది పడాల్సొస్తుంది. ఆడియన్స్‌కి తనపై మళ్లీ నమ్మకం పోక ముందే నితిన్ కథ ఎంపికలో జాగ్రత్త పడాలి. ఇప్పుడు నడుస్తున్న గుడ్ టైమ్‌ని మాగ్జిమమ్ క్యాష్ చేసుకోవాలి.