‘ఐ’ రాక ముందు శంకర్ నుంచి బ్యాడ్ ఫిలిం వస్తుందన్నా ఎవరూ నమ్మేవారు కాదేమో. తనపై అంతటి నమ్మకాన్ని పెంచుకున్న శంకర్ ‘ఐ’తో తీవ్రంగా నిరాశ పరిచాడు. శంకర్ బ్రాండ్‌ని నమ్మేసి ఐని హై రేట్స్‌కి కొనేసిన వారికి ఇప్పుడు భారీ నష్టాలు తప్పట్లేదు. తొలి వారంలో ఇరవై రెండు కోట్లకి పైగా షేర్ అయితే సాధించింది కానీ బయ్యర్లని ఒడ్డున పడేయలేదు.
నలభై కోట్లు కలెక్ట్ అయితే తప్ప ఐ బయ్యర్లు సేఫ్ కారని ట్రేడ్ వర్గాలు తేల్చాయి. కానీ ఈ చిత్రం కలెక్షన్స్ ఫుల్‌గా డ్రాప్ అయిన నేపథ్యంలో ఇక రికవరీ ఇంపాజిబుల్. హిందీ వెర్షన్ కూడా బిలో యావరేజ్‌గా పర్‌ఫార్మ్ చేసింది. టోటల్‌గా ఐ శంకర్ బ్రాండ్ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బ తీసింది.
రోబో ఎఫెక్ట్ ఐ బిజినెస్‌పై ఎంత ఉందో… రేపు దీని ప్రభావం శంకర్ తదుపరి చిత్రంపై ఖచ్చితంగా ఉంటుంది. సినిమా బాలేదని అన్నా కానీ శంకర్ మూవీ మిస్ కాకూడదని ఐ చిత్రాన్ని కొందరు పనిగట్టుకుని చూసారు. ఆ ఫెసిలిటీ శంకర్ నెక్స్‌ట్ సినిమాకి ఉండదు. శంకర్ సినిమా బాలేదనే టాక్ ఇంకోసారి వచ్చిందంటే ఐ అనుభవం గుర్తున్నవారు లైట్ తీసేసుకుంటారు. తన బ్రాండ్‌ని తనే దెబ్బ తీసుకున్న శంకర్‌కి ఇప్పుడు అర్జంటుగా తన మార్కు సెన్సేషనల్ మూవీ చాలా అవసరం. మరి ఎవరితో చేస్తాడో, ఎంత త్వరగా చేస్తాడో కానీ.. ఐ ని మరిపించే సినిమా అర్జంటుగా వచ్చేయాలి.