సాధారణంగా సినిమా తారలు పండగలొచ్చినప్పుడు, పిండి వంటల్ని స్వగృహ ఫుడ్స్‌కు వెళ్లి ప్యాక్ చేయించుకుని తెచ్చుకుంటారు. అయితే క్యారెక్టర్ నటి, ఆంటీ పాత్రలకు పేరు పొందిన హేమ మాత్రం అలాంటి రెడీమేడ్ ఫుడ్స్ జోలికి వెళ్లననీ, ఏదయినా సరే స్వయంగా ఇంట్లో తయారుచేసుకోవడం అలవాటని చెబుతుంది. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా సరే పండగలకు సంబంధించిన ఆయా పిండి వంటలను తన భర్త సాయంతో ఇంట్లోనే చేసుకుంటానని చెబుతుంది.
రాజోలు టౌన్‌లో తమ ఇంటి పక్కనే మిఠాయి షాపులూ, ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ షాపులు ఉండేవనీ, చిన్నతనం నుండీ వాటిని రుచి చూసి, వాటిని తయారు చేసే విధానం చూసి, వాటి కన్నా ఇంట్లో చేసుకోవడం ఎంతో ఆరోగ్యం అని తెలుసుకుందట. ఇంట్లో చేసే పిండి వంటల్లో ఎక్కువగా బూరెలు, గారెలూ, సున్నుండలూ, పప్పుండలూ ఎంతో రుచిగా చేస్తుందట.
కేవలం వండకుని ఇంట్లో తినెయ్యడమే కాకుండా వాటిని సెట్లోకి కూడా తీసుకొచ్చి తోటి నటీనటులకూ, డైరెక్టర్లకూ తినిపించడం కూడా అలవాటట. బజార్లో దొరికూ స్వీట్లు, పిండివంటలు ఎలా చేస్తారో ఏమో.. తినే పదార్ధాలు కాబట్టి శుచిగా ఉండేవి కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో చేసుకుని తినడం మంచిదని కూడా సలహా ఇస్తుంది హేమ. అందుకే కాబోలు హేమ బుగ్గలు బూరెల్లా ఉంటాయి మరి.