కళ్యాణ్‌ రేంజ్‌కిది ఎక్కువే

నందమూరి కళ్యాణ్‌రామ్‌కి హిట్టొచ్చి చాలా కాలమవుతోంది. ‘అతనొక్కడే’ తర్వాత అతడిని నిర్మాతగా సంతోషపెట్టిన సినిమా రాలేదు. కానీ ‘పటాస్‌’ సినిమాపై ఎందుకో అందరూ పాజిటివ్‌గానే ఉన్నారు. ఈ సినిమాపై ఎంత పాజిటివ్‌గా ఉన్నారంటే… అన్ని…

నందమూరి కళ్యాణ్‌రామ్‌కి హిట్టొచ్చి చాలా కాలమవుతోంది. ‘అతనొక్కడే’ తర్వాత అతడిని నిర్మాతగా సంతోషపెట్టిన సినిమా రాలేదు. కానీ ‘పటాస్‌’ సినిమాపై ఎందుకో అందరూ పాజిటివ్‌గానే ఉన్నారు. ఈ సినిమాపై ఎంత పాజిటివ్‌గా ఉన్నారంటే… అన్ని ఏరియాల్లోను ఈ చిత్రం బిజినెస్‌ విడుదలకి ముందే క్లోజ్‌ అయిపోయింది. 

ఈ చిత్రం థియేట్రికల్‌ బిజినెస్‌ తొమ్మిది కోట్లకి పైగానే జరిగిందని ట్రేడ్‌ రిపోర్టులు వస్తున్నాయి. అంటే శాటిలైట్‌ రైట్స్‌ ఇతరత్రా రూపంలో మరో మూడు, నాలుగు కోట్లు ఎటూ పోవు. ఈసారి త్రీడీ ఎఫెక్టులలాంటి వాటి జోలికి పోకుండా కళ్యాణ్‌రామ్‌ సింపుల్‌గా ఉంచాడు. ఫలితంగా అతను విడుదలకి ముందే సేఫ్‌ అయిపోయాడు. 

తొమ్మిది కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అంటే అన్ని పార్టీలకీ అనుకూలంగానే ఉంటుంది. కళ్యాణ్‌ రీసెంట్‌ ట్రాక్‌ రికార్డ్‌కి ఇది ఎక్కువ మొత్తమే అయినప్పటికీ… డీసెంట్‌ టాక్‌ తెచ్చుకున్నట్టయితే లాంగ్‌ వీకెండ్‌ వల్ల త్వరగా సేఫ్‌ అయిపోవడానికి ఆస్కారముంది. సంక్రాంతి సినిమాలు ఎలాగో స్లో అయ్యాయి కాబట్టి ఈ వారం వస్తున్న సినిమాల్లో ‘పటాస్‌’ కే అడ్వాంటేజ్‌ ఎక్కువ ఉంటుంది.