మంచు ఫ్యామిలీలో ఎవర్నీ వదల్లేదు

‘నా ఇష్టం’ వచ్చిన సినిమాలు తీసుకుంటానంటూ.. టెక్నాలజీ పేరిట, మార్కెటింగ్‌ స్ట్రాటజీల పేరిట ఏవో ప్రయోగాలు చేస్తోన్న రామ్‌గోపాల్‌వర్మ ఈమధ్య ఎక్కువగా మంచు ఫ్యామిలీ మెంబర్స్‌తోనే సినిమాలు తీస్తున్నాడు. విష్ణుతో రౌడీ, అనుక్షణం చిత్రాలు…

‘నా ఇష్టం’ వచ్చిన సినిమాలు తీసుకుంటానంటూ.. టెక్నాలజీ పేరిట, మార్కెటింగ్‌ స్ట్రాటజీల పేరిట ఏవో ప్రయోగాలు చేస్తోన్న రామ్‌గోపాల్‌వర్మ ఈమధ్య ఎక్కువగా మంచు ఫ్యామిలీ మెంబర్స్‌తోనే సినిమాలు తీస్తున్నాడు. విష్ణుతో రౌడీ, అనుక్షణం చిత్రాలు చేసిన వర్మ ‘రౌడీ’లో మోహన్‌బాబుని కూడా డైరెక్ట్‌ చేసాడు. 

అంతకుముందే మంచు లక్ష్మితో డిపార్ట్‌మెంట్‌, దొంగల ముఠా చిత్రాలు తీసాడు. ఇప్పటికీ మంచు ఫ్యామిలీతో మంచి రిలేషన్‌ మెయింటైన్‌ చేస్తోన్న వర్మ తన తదుపరి చిత్రం ఒకటి మోహన్‌బాబుతో చేస్తానన్నాడు. ఆ చిత్రం కోసమని గుండు కూడా చేయించుకున్న మోహన్‌బాబు ఇంకా దానిని ఎందుకో మొదలు పెట్టలేదు. 

ఇంతవరకు మంచు ఫ్యామిలీలో అందరూ వర్మ డైరెక్షన్‌లో నటించారు కానీ మనోజ్‌ ఒక్కడే మిస్సయ్యాడు. అతనికి కూడా త్వరలోనే ఆ ముచ్చట తీరిపోనుంది. వర్మ తీయబోయే నెక్స్‌ట్‌ సినిమాల్లో ఒక దాంట్లో మనోజ్‌ హీరోగా నటిస్తాడట. ఈ సినిమా ఏ జోనర్‌, మిగతా తారాగణం ఎవరనేది ఇంకా తెలీలేదు.