పవన్‌కళ్యాణ్‌కి మూడేళ్ల క్రితం వరకు ఒక్క నలభై కోట్ల చిత్రం కూడా లేదు. ముప్పయ్ కోట్లకి దగ్గరగా వచ్చిన జల్సానే అతని కెరీర్‌లో టాప్ ప్లేస్‌లో ఉండేది. గబ్బర్‌సింగ్‌తో నలభై.. యాభై.. కూడా దాటేసి సరాసరి అరవై కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఆ తర్వాత అత్తారింటికి దారేదితో 75 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌ని కైవసం చేసుకున్నాడు.
తెలుగు సినిమా వరకు ప్రతిష్టాత్మకంగా భావించే నలభై కోట్ల క్లబ్‌లో పవన్‌కి ఇంతవరకు ఈ రెండు సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు ‘గోపాల గోపాల’ కూడా నలభై కోట్ల షేర్ దాటి.. పవన్‌కి మూడో నలభై కోట్ల సినిమా అయింది. ఇంతకుముందు మహేష్‌తో కలిసి యాభై కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకున్న వెంకటేష్‌కి ఇప్పుడు పవన్‌కళ్యాణ్ సపోర్ట్‌తో ఇంకో ఫార్టీ దొరికింది.
‘గోపాల గోపాల’ ఫైనల్ రేంజ్ ఏంటనేది ఈ వీకెండ్ వచ్చే వసూళ్లతో తేలిపోతుంది. వివిధ ట్రేడ్ సోర్సెస్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి హిట్ స్టేటస్‌కి మరో ఆరేడు కోట్ల దూరంలో ఉందని తేలింది.