కొత్త వాళ్లతో సినిమా తీయడం అంటే దర్శకుడు తేజకు మొదట్నించీ మహా ఇష్టం. ఆయన సినిమాలు దాదాపు అన్నీ అలాంటివే. ఏవో ఒకటి రెండు తప్పించి. మళ్లీ ఇప్పుడు అలాంటి వ్యవహారం ఒకటి తలకెత్తుకున్నాడు. అందరూ కొత్తవాళ్లతో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాడు.
పైగా ఈసినిమాలో ప్రతినాయకుడిగా నటించేందుకు ఓ నిర్మాతను ఎన్నుకొన్నాడు. మిస్టర్ నోకియా, మేం వయసుకు వచ్చాం, పిల్ల జమిందార్ లాంటి సినిమాలు నిర్మించిన డిఎన్ రావును విలన్ గా పరిచయం చేయబోతున్నాడు.
ఇక హీరో, హీరోయిన్ల సంగతి చెప్పనక్కరలేదు. సినిమాల్లో విలనిజాన్ని మంచి నటుల చేత బాగా పండించే తేజ ఈ సినిమాలో కూడా క్లిక్ అయితే మరో మంచి విలన్ తెలుగుతెరకు దొరికినట్లే.