ఫ్రీ రీరికార్డింగ్ ప్లీజ్?

పాపం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే చక్కటి సినిమా తీసి, మంచి డైరక్టర్ అనిపించుకున్నాడు క్రాంతి మాధవ్. కానీ తరువాత సినిమాకు మాత్రం అడ్డంగా బుక్ అయిపోయాడు. సునీల్ హీరోగా ఉంగరాల…

పాపం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే చక్కటి సినిమా తీసి, మంచి డైరక్టర్ అనిపించుకున్నాడు క్రాంతి మాధవ్. కానీ తరువాత సినిమాకు మాత్రం అడ్డంగా బుక్ అయిపోయాడు. సునీల్ హీరోగా ఉంగరాల రాంబాబు సినిమాను ఓకె చేసుకున్నాడు. ఎప్పుడో తను కష్టాల్లో వున్నపుడు అడ్వాన్స్ ఇచ్చి ఆదుకున్నారన్న కృతజ్ఞతతో పరుచూరి ప్రసాద్ కు సినిమా చేయడానికి ముందుకు వచ్చారు.

కానీ కష్టపడి సినిమా అయితే పూర్తి చేసారు కానీ, విడుదలకు ఆటంకాలు తప్పడంలేదు. డబ్బులు ఇవ్వలేదని హీరో సునీల్ డబ్బింగ్ ఆపేసి విదేశాలకు షూటింగ్ కు వెళ్లారు. ప్రకాష్ రాజ్ దీ అదేదారి. లేటెస్ట్ గా సినిమాకు రీరికార్డింగ్ కూడా కాలేదట. సంగీత దర్ళకుడు జిబ్రాన్ కు ఇంకా తొమ్మిది లక్షల వరకు బకాయి వుందట. ఇంక ఇవ్వలేను, సినిమా వల్ల లాస్ అయ్యాను అని నిర్మాత చెబుతున్నట్లు తెలుస్తోంది. అయినా రీ రికార్డింగ్ మాత్రం పూర్తి చేయమని అడుగుతున్నట్లు తెలుస్తోంది.

పాటలు అంటే చేయగలను కానీ, రీరికార్డింగ్ అంటే వాయిద్య కారులు అందరికీ పేమెంట్లు ఇవ్వాలని, తానేలా ఫ్రీగా చేస్తానని సంగీత దర్శకుడు అంటున్నట్లు తెలుస్తోంది. అలా అయితే నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వాలని, చిన్నవాళ్లు ఎవరితోనైనా ఓ లక్ష ఇచ్చి రీ రికార్డింగ్ చేయించేసుకుంటానని నిర్మాత కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్రాంతి మాధవ్ లాంటి డైరక్టర్ సినిమాకు ఎవరో ఒకరి చేత తూతూ మంత్రంగా రీరికార్డింగ్ కానిచ్చేయడం అంటే, అయ్యో అనికాక ఇంకేమంటారు? కాస్త మంచి సినిమా కాబట్టే ఎవరైనా ఆదుకుని, సాయంపట్టి ఒడ్డున పడేసినా బాగుండును.