ఓ మైగాడ్తో పవన్ ఎంట్రీ ఇచ్చాడన్న ఆనందం కంటే, గబ్బర్ సింగ్ 2 ఉంటుందా? లేదా?? అనే భయాలే ఎక్కువయ్యాయి పవన్ అభిమానులకు. గబ్బర్ సింగ్ 2 లేదని, ఆ సినిమా స్థానంలోనే శరత్ మరార్కు ఓమైగాడ్రిమేక్ సినిమాలో భాగం పంచాడనే టాక్ వినిపిస్తోంది.
అయితే పవన్ క్యాంపు మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. గబ్బర్ సింగ్ 2 సినిమా ఖాయంగా ఉంటుందని, ఈ సినిమా ఆగే ప్రసక్తేలేదని వాదిస్తోంది. ఓ మైగాడ్ కీ, గబ్బర్ సింగ్ 2కీ సంబంధమే లేదని, ఒకేసారి రెండు సినిమాలు చేయకూడదనే రూలు ఎక్కడా లేదని వాదిస్తున్నారు. అయితే గబ్బర్ 2 ఎప్పుడనే విషయంలో వాళ్లకూ క్లారిటీ లేదు. స్ర్కిప్టు విషయంలో పవన్ సంతృప్తిగా లేడని, అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతోందని చెబుతున్నారు.
మరో వర్గం మాత్రం… శరత్ మరార్ దగ్గర డబ్బుల్లేవని, అలాంటప్పుడు ఒకేసారి 2 సినిమాలు ఎలా టేకప్ చేస్తాడని, కథపై నమ్మకం లేకుండా పవన్ ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లరని చెబుతున్నారు. మరి పవన్ మాటేంటో..? గబ్బర్ సింగ్2 సినిమా విషయంలో మరో రెండు మూడు రోజుల్లో శరత్ మరార్ ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంత వరకూ ఆగాల్సిందే.