మహేష్, పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్… ఇలా స్టార్ కథానాయకులతో సినిమాలు తీస్తూ వచ్చిన పూరి నితిన్‌తో `హార్ట్ ఎటాక్` తెరకెక్కించాడు. పూరి తన సొంత సంస్థలోనే నిర్మించిన ఆ చిత్రం చక్కటి వసూళ్లు రాబట్టుకొంది. నితిన్‌కి హ్యాట్రిక్ విజయాన్ని అందించింది.
తొలుత సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా…. ఆ తర్వాత మాత్రం కమర్షియల్‌గా నిలదొక్కుకుంది. దీంతో పూరి ఆనందానికి అవధుల్లేవు. నిర్మాతగా, దర్శకుడిగా నేను ఫుల్ హ్యాపీ అంటున్నారాయన. నితిన్ కూడా నాకు పూరి… మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టాడని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
ఈ ఇద్దరి కలయికలో మరో చిత్రం తెరకెక్కబోతోందని తెలుస్తోంది. తదుపరి పూరి జగన్నాథ్… మహేష్‌తో ఓ సినిమా చేస్తాడు. ప్రస్తుతం ఆ కథపైనే కూర్చున్నాడు. ఆ తర్వాత మాత్రం మళ్లీ నితిన్‌తోనే సినిమా చేస్తాడట పూరి. ఆ మేరకు నితిన్‌కి మాట కూడా ఇచ్చాడట. ఆ చిత్రం కూడా సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కిస్తారని సమాచారం.