‘గది’లో ఇద్దరే హీరోయిన్లు

ఓంకార్ లాంటి చిన్న డైరక్టర్ తో అగ్రనటుడు నాగార్జున చేస్తున్న సినిమా రాజుగారి గది 2. నిజానికి రాజుగారి గది సినిమాకు దీనికి ఏమీ సంబంధం లేకపోయినా, మళయాల సినిమాకు రీమేక్ అయినా ఆ…

ఓంకార్ లాంటి చిన్న డైరక్టర్ తో అగ్రనటుడు నాగార్జున చేస్తున్న సినిమా రాజుగారి గది 2. నిజానికి రాజుగారి గది సినిమాకు దీనికి ఏమీ సంబంధం లేకపోయినా, మళయాల సినిమాకు రీమేక్ అయినా ఆ పేరుకు వున్న క్రేజ్ ను దృష్టిలో వుంచుకుని ఆ పేరే ఫిక్స్ చేసారు.

ఈ సినిమాలో సమంత, రిచా పనాయ్ లను హీరోయిన్ లుగా ఫిక్స్ చేసారు. ఆ తరువాత మరో మూడో హీరోయిన్ ను కూడా తీసుకుంటారని ఆది నుంచీ అంటూ వచ్చారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఇక మూడో హీరోయిన్ వుందన్నది. అంటే వుండదు అని కాదు. ప్రామినెంట్ హీరోయిన్ ఎవర్నీ తీసుకోవడం లేదు. ఆ మూడో హీరోయిన్ పాత్ర మరీ అంత ప్రాధాన్యత వున్నది కాదని, అందువల్ల దానికోసం మళ్లీ మరో హీరోయిన్ అనవసరం అని యూనిట్ డిసైడ్ అయిందట. అందువల్ల ఈ పాత్రకు జస్ట్ ఓ చిన్న నటిని తీసుకుంటున్నారట. ఈ సినిమాలో నాగ్ ది ఓ స్పెషల్ రోల్.