గ్యాంగ్ మంచి టాక్ వచ్చి కూడా

అజ్ఞాతవాసి అనేది ఫెయిల్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అందుకే అంత భారీ విడుదల ఫ్లాన్ చేసారు. దాదాపు రాష్ట్రంలో స్క్రీన్ లలో 70శాతం అజ్ఞాతవాసికే బుక్ అయిపోయాయి. Advertisement జై సింహాకు కూడా పెద్దగా…

అజ్ఞాతవాసి అనేది ఫెయిల్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అందుకే అంత భారీ విడుదల ఫ్లాన్ చేసారు. దాదాపు రాష్ట్రంలో స్క్రీన్ లలో 70శాతం అజ్ఞాతవాసికే బుక్ అయిపోయాయి.

జై సింహాకు కూడా పెద్దగా థియేటర్లు దొరకలేదు కానీ, ఎ, బి సెంటర్లలో బాగానే దొరికాయి. సి సెంటర్లలో ఓ మాదిరిగా దొరికాయి. ముందుగానే డేట్ పక్కగా అనుకున్న రంగులరాట్నం సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి 200నుంచి 225థియేటర్లు దొరికాయి.

కానీ గ్యాంగ్ వరకు వచ్చేసరికి సరిపడా స్క్రీన్ లు, షో లు దొరకలేదు. ఎ సెంటర్లు ఓకె. బి సెంటర్లలో ఓ మాదిరిగా దొరికాయి. సి ల్లో సమస్య అయింది.

దీనికి తోడు గ్యాంగ్ పబ్లిసిటీ కూడా కాస్త లేట్ అయింది. సూర్య రంగంలోకి దిగిన తరువాత కాస్త ఊపు వచ్చింది. కానీ అప్పటికే స్క్రీన్ లు నిండిపోయాయి. అజ్ఞాతవాసి ఫీవర్ అందుకుంది.

సంక్రాంతికి ఇఫ్పటి వరకు విడుదలయిన సినిమాల్లో మంచి రేటింగ్ లు, మంచి టాక్ గ్యాంగ్ కే వచ్చింది. కానీ సరిపడా స్క్రీన్ లు లేక, షేర్ కనిపించలేదు. సంక్రాంతి సందడి మంగళవారంతో ముగిసాక, బుధవారం నుంచి మరో పదిరోజలు టైమ్ వుంది మళ్లీ కొత్త సినిమాలు థియేటర్లలోకి రావడానికి.

ఎందుకంటే 19న సినిమాలు లేవు. సో, పోస్ట్ సంక్రాంతి గ్యాంగ్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఆ పది రోజులు చాలు గ్యాంగ్ కు.