‘గంగ’ మునుగుతుందా? ముంచుతుందా?

గంగ సినిమా సస్సెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా ఊర మాస్ లెవెల్ లో వుందని, మన బి సి సెంటర్లకు భలేగా నప్పుతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ టాక్ వచ్చేవారం విడుదలయ్యే సినిమాలను…

గంగ సినిమా సస్సెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా ఊర మాస్ లెవెల్ లో వుందని, మన బి సి సెంటర్లకు భలేగా నప్పుతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ టాక్ వచ్చేవారం విడుదలయ్యే సినిమాలను బెంగపెడుతోంది. 23న కాయ్ రాజా కాయ్ విడుదలవుతోంది. క్రైం కామెడీ జోనర్. బి సెంటర్లకు బాగా పడుతుంది. 24న దోచేయ్ విడుదలవుతుంది. ఇది ఎ సెంటర్ల సినిమా. ఇప్పడు ఈ రెండింటికి కూడా గంగ ఇబ్బంది పెడుతుందేమో అన్న బెంగ పెరుగుతోంది. 

అయితే గంగ ముంచడం సంగతి అలా వుంచితే,  అసలు ఆ సినిమా కష్టాల నుంచి గట్టెక్కుతుందా అన్న అనుమానం వినిపిస్తోంది. ఇప్పుడు టాక్ బాగుంది కాబట్టి, వీలయినంత అడ్వాన్స్ లు రాబట్టి, అప్పుడు సినిమా వదలాలన్నది నిర్మాత బెల్లంకొండ ఆలోచనగా తెలుస్తోంది. 

ఇదిలా వుంటే ఎలాగైనా శనివారం రాత్రి డిస్కషన్లు ముగించి, ఆదివారం సినిమా వదలాలని నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నించారని వినికిడి. ఇందులో భాగంగా ఓ ఫైనాన్సియర్ కు ఓ ప్లాట్ ఇస్తానని అన్నట్లు, కానీ రిజిస్ట్రేషన్ చేస్తేనే ఓకె అంటానని అతడు అన్నట్లు వార్తలు వినవస్తున్నాయి.రిజిస్ట్రేషన్ అంటే సోమవారం తప్ప సాధ్యం కాదు. కానీ ఆ ఫైనాన్షియర్ అలా కాకుండా ఓకె అనడానికి ఒప్పుకోలేదని వార్తలు వినవస్తున్నాయి. 

ఇదిలా వుంటే సోమవారం వస్తే, మరెవరైనా కొర్టు తలుపులు తట్ట వచ్చని, దాని వల్ల కొత్త చిక్కులు ఎదురవుతాయని, అందువల్ల శనివారం రాత్రే ఈ వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని బెల్లంకొండ అనుకున్నారని, కానీ అలా సాధ్యం కాలేదని టాలీవుడ్ వర్గాల బోగట్టా. మరేమవుతుందో, మరో రోజు గడిస్తే కానీ తెలియదు.