టాలీవుడ్ అంటే సెంటిమెంట్లకు పెట్టింది పేరు. ఎందుకంటే సినిమా కోట్లతో వ్యాపారం కాబట్టి. రెండో నెంబర్ పై ఇక్కడ గమ్మతైన నమ్మకాలున్నాయి. కొత్త దర్శకుడు తొలి సినిమా హిట్ కొట్టాక, రెండో సినిమా గండం గట్టెక్కడం అన్నది చాలా కష్టం. అతి కొద్ది మంది మాత్రమే ఈ గండాన్ని దాటారు.
అలాగే దర్ళడుడి సురేందర్ రెడ్డి ప్రతి రెండో సినిమా విజయం డవుట్ గా వుంటుంది. ఆయన సినిమా ఒకటి హిట్ అయితే రెండోది డవుట్. మళ్లీ తరువాతిది సూపర్ హిట్..ఆ తరువాత డవుట్ అలా అన్నమాట. అదే విధంగా పెద్ద హీరోలు వరుసగా రెండు హిట్ లు ఇవ్వడం అన్నదీ అనుమానమే.
చిరంజీవి గతంలో రెండు సార్లు ఈ ఫీట్ చేసారు. మరెవ్వరూ అంతగా చేయలేకపోయారు. అదే విధంగా ఒకే రెండు పాత్రలు ధరించిన సినిమాలు ఎక్కువ శాతం హిట్ అవుతాయని ఓ నమ్మకం. కానీ అదే మూడు పాత్రలు పోషించిన సినిమాలు హిట్ అయినవి తక్కువ. ఇలా ఎన్ని నమ్మకాలో టాలీవుడ్ లో.