గంగ (ముని 3)సినిమా డవుట్ లో పడిందా? ఈ సినిమాకు సంబంధించిన ఆర్థికలావాదేవీల పై కేసులు, ఫిర్యాదులు పడే అవకాశం వుందని వార్తలు వినవస్తున్నాయి. లేదు..ఇప్పటికే ఈ సినిమా వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కేదారిలో వుందని, అలాగే పోలీసు కేసు కూడా పడే అవకాశం వుందని గుసగుసలు వినవస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించి ల్యాబ్ లో రెండు కోట్ల రూపాయిల లావాదేవీకి సంబంధించి ఓ ఫైనాన్షియర్ కు , నిర్మాత బెల్లంకొండ సురేష్ కు నడుమ టస్సెల్ బిగిసిందన్నది టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఏ విషయమూ మంగళవారం తెలుస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో గతంలో రభస సినిమా సమయంలో బెల్లంకొండకు ఫైనాన్స్ చేసిన వారు కూడా తమ బాకీల గురించి ఇప్పుడే వత్తిడి చేయాలని ఆలోచిస్తున్నారన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి.
రాజీలు, రాయబారాలు నడిస్తే ఓకె కానీ, లేకుంటే వ్యవహారం కాస్త గట్టిగానే బిగుసుకునేలా వుందని తెలుస్తోంది. ముని రెండు భాగాలు హిట్ కావడంతో, మూడో భాగంపై మంచి అంచనాలే వున్నాయి. ఈ సినిమా 17న విడుదల కావాల్సివుంది.