సునీల్‌ రేసులో దూసుకొచ్చేదెప్పుడో.!

కమెడియన్‌గా లెక్కలేనన్ని సినిమాలు చేసి, టాప్‌ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్‌ అనుకోకుండా హీరో అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ కామెడీ వేషాలేశాడు. రాజమౌళి ‘మర్యాదరామన్న’ సినిమా కోసం సునీల్‌ని ఎంపిక చేశాక,…

కమెడియన్‌గా లెక్కలేనన్ని సినిమాలు చేసి, టాప్‌ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్‌ అనుకోకుండా హీరో అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ కామెడీ వేషాలేశాడు. రాజమౌళి ‘మర్యాదరామన్న’ సినిమా కోసం సునీల్‌ని ఎంపిక చేశాక, ఇక మళ్ళీ కామెడీ పాత్రల వైపు ఆసక్తి చూపించలేదు సునీల్‌. హీరోగానే వరుసగా సినిమాలు చేసిన సునీల్‌ కెరీర్‌లో భారీ స్పీడ్‌ బ్రేకర్‌ ఎదురయ్యింది.

‘మిస్టర్‌ పెళ్ళికొడుకు’, ‘భీమవరం బుల్లోడు’ సినిమాలు ఇచ్చిన షాక్‌తో సునీల్‌ కెరీర్‌ గందరగోళంలో పడిపోయింది. ఆ టైమ్‌లో కమిట్‌ అయిన సినిమాలే పట్టాలెక్కేందుకు మొహమాటపడ్డంతో, కెరీర్‌ విషయంలో ఆషామాషీగా వుంటే కుదరదన్న విషయం సునీల్‌కి అర్థమయ్యింది. అందుకే, కాస్త జాగ్రత్తగా కెరీర్‌ని ప్లాన్‌ చేసుకుంటున్నాడు సునీల్‌.

లేటెస్ట్‌గా సునీల్‌, ‘జోష్‌’ ఫేం వాసు వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఈ చిత్రానికి ‘దిల్‌’ రాజు నిర్మాత. ‘కృష్ణాష్టమి’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. టైటిల్‌ సంగతెలా వున్నా, ‘దిల్‌’ రాజు బ్యానర్‌లో సినిమా అంటే సునీల్‌కి మళ్ళీ లైఫ్‌ ఖాయమే. ఈ సినిమాతో సునీల్‌ సక్సెస్‌ రేసులో మళ్ళీ తన ప్లేస్‌ని నిలబెట్టుకుంటాడా.? వేచి చూడాల్సిందే.