బెల్లంకొండ సురేష్ అప్పుల సమస్యలు గంగ (ముని 3) విడుదలను అడ్డుకుంటున్నాయి. కొంతమంది ఫైనాన్షియర్లు స్టే తీసుకువచ్చినట్లు తెలిసింది. స్టే కారణంగా సినిమా విడుదల కావడం అన్నది సందిగ్ధంలో పడినట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా.
రభస, అల్లుడు శీను సినిమాల సమయంలో బెల్లంకొండ సురేష్ భారీగా ఫైనాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మల్టీ డైమన్షన్ సంస్థకు కూడా బెల్లంకొండ భారీగా బకాయి పడినట్లు వినికిడి. అదీ కాక, పొద్దుటూరుకు చెందిన కొంతమంది ఫైనాన్షియర్లకు కూడా భారీగా బకాయిలు వున్నట్లు వినిపిస్తోంది.
పొద్దుటూరు బకాయిలకు ఓ ఖరీదైన స్థలం ఇచ్చినా, అది పది కోట్ల మేరకే తీరినట్లు మిగిలిన దానిపై మల్లగుల్లాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ మాత్రం ఎలాగైనా స్టే తొలంగింపచేసి, శనివారం, ఆదివారమైనా విడుదల చేయాలని చూస్తున్నట్లు కూడా వార్తలు వినవస్తున్నాయి.