దసరా రేసులోకి దూసుకొస్తున్నాడు ‘గోవిందుడు..’. రామ్‌చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ‘గోవిందుడు అందరివాడేలే’ అక్టోబర్ 1న విడుదల కానున్న విషయం విదితమే. సినిమా నిర్మాణంలో సినిమాపై చాలా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సినిమా రూపొందుతోన్న తీరు హీరోకి నచ్చలేదనీ, హీరోకీ దర్శకుడికీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనీ, నిర్మాతకీ దర్శకుడికీ పొసగలేదనీ లెక్కలేనని పుకార్లు షికార్లు చేశాయి.
అయితే, కృష్ణవంశీ తెలుగు సినిమా ఆస్తి.. అంటూ హీరో రామ్‌చరణ్ ఇచ్చిన స్టేట్మెంట్తో ప్రాజెక్ట్‌పై హీరో, దర్శకుడు, నిర్మాత ఎంత కాన్ఫిడెంట్‌గా వున్నారనే విషయం స్పష్టమైపోయింది. తొలి టీజర్‌తో సినిమాపై స్టార్ట్ అయిన అంచనాలు.. తర్వాత్తర్వాత ఆకాశాన్నంటే రేంజ్‌కి ఎదిగిపోయాయి. ‘రభస’, ‘ఆగడు’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోవడంతో.. ఇప్పుడంతా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాపైనే దృష్టిపెట్టారు.
‘అత్తారింటికి దారేది’ రికార్డుల్ని బద్దలుగొట్టే సత్తా రామ్‌చరణ్ సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’కి వుందన్న ప్రచారం షురూ అయ్యింది. సినిమాకి పాజిటివ్ బజ్ స్టార్ట్ అయ్యిందిప్పుడు. సినిమా పూర్తయ్యాక, సెన్సార్ కూడా అయిపోయాక ఇటీవలే బండ్ల గణేష్, తన సన్నిహితుల కోసం స్పెషల్‌గా సినిమాని ప్రదర్శించాడనీ.. సినిమా చూసినవారంతా అద్భుతం అంటున్నారనీ తెలుస్తోంది.
ఇక, సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అంటూ ‘గోవిందుడు అందరివాడేలే’ టీమ్‌ని అభినందించారట. ఎలాగూ రెండ్రోజుల్లో సినిమా విడుదల కానుంది గనుక, ప్రీ రిలీజ్ పాజిటివ్ బజ్.. సినిమాకి ఏ రేంజ్లో హెల్పవుతుందో.. సినిమా అసలెలా వుందో.. తెలియాలంటే అప్పటిదాకా వేచి చూడాల్సిందే.
మరోపక్క అభిమానులు మాత్రం సినిమాకి ప్రీ రిలీజ్ టాక్ అదిరిపోవడంపై ఫుల్ హ్యాపీగా వున్నారు. సినిమాకి దసరా సెలవులు కలిసొస్తాయనీ, కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు.. సినిమా ఇండస్ట్రీ హిట్ అయిపోవడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. ఫ్యామిలీ సినిమా కావడంతో ఇప్పటిదాకా ఓవర్సీస్ మార్కెట్లో పెద్దగా ప్రాబల్యం లేకుండా పోయిన రామ్‌చరణ్, ఈ సినిమాతో ఓవర్సీస్పైనా పట్టు సాధించే అవకాశం వుందన్నది ఇన్సైడ్ సోర్సెస్ కథనం. చూద్దాం.. ఏం జరుగుతుందో.!