గిరాకీ వున్న సరుకుచేతిలో వుంటే, అంతగా చెల్లని సరుకు వున్నా, కలిపి తోసేయచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో శాటిలైట్ బిజినెస్ ఇలాగే వుంది. సినిమా సరిగ్గా ఆడక,శాటిలైట్ కాకపోతే, చింతపడడం లేదు. మళ్లీ మరో హిట్ వచ్చిపుడు,దానికి జత చేసి దీన్ని తోసేస్తున్నారు. ఆ మధ్య హుద్ హుద్ కార్యక్రమం అప్పుడు సురేష్ బాబు తన సినిమాలన్నీ ఇలాగే ఆఫర్ లో ఇచ్చేసారని వినికిడి.
ఇప్పుడు తాజాగా అలాంటి ఇన్సిడెంట్ మరోటి జరిగిందని తెలుస్తోంది. అల్లు అర్జున్ సరైనోడు సినిమాకు తమ్ముడు శిరీష్ సినిమాను ముడిపెట్టి ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం అల్లు శిరీష్ –పరుశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా తయారవుతోంది. ఈ సినిమాను సరైనోడు సినిమాతో పాటు ఫ్రీగా ఇచ్చేసారని వినికిడి. సినిమాకు ఏమీ ఇవ్వనవసరం లేదని, కానీ టీవీలో బ్రాడ్ కాస్ట్ మాత్రం కచ్చితంగా చేయాలని, కండిషన్ పెట్టినట్లు తెలిసింది.
ఎంత కాదన్నా యాభై లక్షల సినిమా ..ఫ్రీగా వస్తోంది..ఎందుకుకాదంటారు. పైగా అది కూడ సరైనోడు కోసం..ఆ అవకాశం ఎందుకు వదులుకుంటారు. అందుకే ఎప్పుడు చెబితే, అప్పడే శిరీష్-పరుశురామ్ లసినిమా బ్రాడ్ కాస్ట్ చేస్తామని మాట ఇచ్చి, సరైనోడు హక్కులు సంపాదించిందట ఓ చానెల్. అంటే బై వన్ గెట్ వన్ ఆపర్ లాంటి దన్నమాట.