ఊహించని విధంగా శైలజారెడ్డి అల్లుడు సినిమా వాయిదాపడింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈనెల 31కి సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ స్వయంగా నాగచైతన్య, సినిమా పోస్ట్ పోన్ అయిందంటూ ట్వీట్ చేశాడు. కేరళ వరదల కారణంగా పోస్ట్-ప్రొడక్షన్ లేట్ అయిందని కారణం కూడా చెప్పాడు. కానీ అసలు కారణం ఇది కాదు. శైలజారెడ్డి అల్లుడు విడుదల వాయిదా వెనక గీతగోవిందం ఎఫెక్ట్ బాగా పనిచేసింది.
గీతగోవిందం సినిమా ప్రీ-క్లయిమాక్స్ నుంచి ఎంటరవుతాడు వెన్నెల కిషోర్. అతడి ఎంట్రీ నుంచి సినిమా మరింత ఊపందుకుంటుంది. అలా ప్రేక్షకులకు ఫుల్లుగా ఎంటర్ టైన్ మెంట్ అందించాడు వెన్నెల కిషోర్. సరిగ్గా ఇలాంటి ఎంట్రీనే శైలజారెడ్డి అల్లుడు సినిమాలో కూడా ఉంది. గీతగోవిందం సినిమా రిలీజ్ కు ముందు వరకు మేకర్స్ ఈ ఎపిసోడ్ పై కాస్త నమ్మకంగానే ఉన్నారు.
కానీ గీతగోవిందంలో వెన్నెల కిషోర్ ఎపిసోడ్ చూసిన తర్వాత, శైలజారెడ్డి అల్లుడు సినిమాలో అతడు నటించిన కామెడీ పోర్షన్ తేలిపోతుందని ఈజీగానే కనిబెట్టగలిగారు. అందుకే శైలజారెడ్డి అల్లుడు సినిమాకు సంబంధించి వెన్నెల కిషోర్ పోర్షన్ ను మళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించారు. సినిమా రిలీజ్ వాయిదా పడ్డానికి అసలు కారణం ఇదేనని టాక్.
ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరో ఈజీగానే ఊహించొచ్చు. అవును.. నాగార్జున ఆదేశాల మేరకే శైలజారెడ్డి అల్లుడు రీ-షూట్ కు రంగం సిద్ధమైంది. సరిగ్గా టైమింగ్ కుదరడంతో కేరళ వరదలు, గోపీసుందర్ స్టుడియో అంటూ కవర్ చేశారు. రీషూట్ కంప్లీట్ చేసి, సెప్టెంబర్ 13 లేదా 14న శైలజారెడ్డి అల్లుడు సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.