గీతగోవిందం నైజాం @19 కోట్లు

విడుదలయిన తరువాత నాలుగు ఆదివారాలు చూసింది గీత గోవిందం సినిమా.  ఈ నాలుగో ఆదివారంతో కలిపి నైజాంలో 19కోట్ల వసూళ్లకు చేరిపోయింది. ఓ మీడియం హీరో సినిమా నైజాంలో ఈ ఫీట్ సాధించడం అరుదు.…

విడుదలయిన తరువాత నాలుగు ఆదివారాలు చూసింది గీత గోవిందం సినిమా.  ఈ నాలుగో ఆదివారంతో కలిపి నైజాంలో 19కోట్ల వసూళ్లకు చేరిపోయింది. ఓ మీడియం హీరో సినిమా నైజాంలో ఈ ఫీట్ సాధించడం అరుదు. టాప్ హీరోలకు మాత్రమే నైజాంలో 15 కోట్లకు దాటిన వసూళ్లు వున్నాయి. కానీ ఆ మధ్య ఫిదా సినిమాలో మీడియం హీరో వరుణ్ తేజ్ ఈ లీగ్ లోకి వచ్చాడు. 18.05 కోట్ల షేర్ సాధించాడు. అంతకు మించి మిగిలిన ఎవ్వరూ రాలేదు.

మహేష్, పవన్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, మెగాస్టార్, ప్రభాస్ లకు మాత్రమే టాప్ కలెక్షన్ రికార్డులు వున్నాయి. ఇప్పుడు వీరి సరసన విజయ్ దేవరకొండ వచ్చాడు. నైజాంలో 19కోట్ల షేర్ సాధించి 12వ ప్లేస్ లో వున్నాడు. అంతకు మీదన వున్న అంతకు మీదన వున్నవాటిలో దువ్వాడ జగన్నాధమ్, సరైనోడు, ఖైదీ నెంబర్ 150 ఫిగర్ల మీద పలు హీరోల అభిమానుల్లో సందేహాలు వున్నాయి. ముఖ్యంగా దువ్వాడ జగన్నాధమ్ కలెక్షన్ల ఫిగర్లు అప్పట్లో గడబిడకు కారణమయ్యాయి.

20కోట్ల లోపు వసూళ్లలో ఇక ఒక్క ఖైదీ నెంబర్ 150 మాత్రమే మిగిలింది. దాని నైజాం వసూళ్లు 19.55. ప్రస్తుతం మామూలు రోజుల్లో గీత గోవిందం నైజాంలో ఇరవై లక్షల వరకు షేర్ రాబడుతోంది. వీకెండ్స్ లో ముఫై లక్షలకు పైగా వస్తోంది. నిన్న నైజాంలో గీత గోవిందం షేర్ 19 లక్షలకు పైగా వుంది. ఈ లెక్కన చూసుకుంటే ఈవారం అంతాకలిపి మరో కొటి రూపాయలు సులువుగా యాడ్ అయ్యేలా కనిపిస్తోంది.

అదే జరిగితే ఖైదీ, గబ్బర్ సింగ్, సరైనోడు, భరత్ అనే నేను కలెక్షన్లను అధిగమిస్తుంది. ఇవన్నీ ఇరవై కోట్ల లోపే  కలెక్షన్లు నమోదు చేసాయి. ఇదిలా వుంటే గీత గోవిందం ఈ ఆదివారం నాటికి ఆంధ్ర, సీడెడ్, నైజాం కలిపి 48కోట్ల వరుకు షేర్ వసూలు చేసింది. నిన్న ఒక్క రోజునే 90లక్షల వరకు షేర్ వచ్చింది.