ఇప్పుడు అనివార్యంగా కావచ్చు, పరిస్థితుల ప్రభావం కావచ్చు, అబ్బాయ్ ఎన్టీఆర్-బాబాయ్ బాలయ్య ఒక్కటయ్యారు. గడచిన పది రోజులకు పైగా దాదాపు కలిసే వున్నారు. దివంగత హరికృష్ణ 12వ రోజు కార్యక్రమం తరువాత లిమిటెడ్ బంధువులతో జరిగిన, మరో కార్యక్రమంలో కూడా బాలయ్య, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా అరవింద సమేత వీరరాఘవ పంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా బాలయ్య వస్తారని, అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లో చిన్న పాత్రలో అయినా ఎన్టీఆర్ కనిపిస్తాడని వార్తలు పుట్టుకువచ్చేసాయి.
వాస్తవానికి ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల బోగట్టా ప్రకారం, ఈ పది పన్నెండు రోజుల్లో అస్సలు ఈ రెండు విషయాలు డిస్కషన్ కే రాలేదు. సోమవారం నాడు కూర్చుని అరవింద అడియో ఫంక్షన్ వ్యవహారాలు డిస్కస్ చేయాలని మాత్రం ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారు. అరవింద సమేత.. నిర్మాతలయిన హారిక హాసిని సంస్థ మాత్రం ఈ పంక్షన్ విషయంలో ఎటువంటి ఒపినీయన్ తో లేదు.
ఎన్టీఆర్ ఎలా అంటే అలా చేద్దామనే ఆలోచనతోనే వున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా బాలయ్య బాబాయ్ షెడ్యూలు కనుక్కోమని మాత్రం ఎన్టీఆర్ తన మనుషులకు పురమాయించినట్లు తెలుస్తోంది. ఈనెల 20న పంక్షన్ అని ప్రస్తుతానికి అనుకుంటున్నారు. ఆ రోజుకు బాలయ్య ఎక్కడ వుంటారు? బయోపిక్ షెడ్యూలు ఇలాంటివన్నీ తెలుసుకున్న తరువాత, ఈరోజు జరిగే మీటింగ్ లో డిస్కస్ చేసే అవకాశం వుంది.
ఫ్యామిలీ మెంబర్లు అంతా ఒకేసారి ఒకేవేదిక పైకి వస్తే, హరికృష్ణ మరణం నేపథ్యంలో మరీ ఎమోషన్ గా మారి, ఫంక్షన్ తీరు మారుతుందేమో అన్న ఆలోచన కూడా వున్నట్లు వినికిడి. అదే సమయంలో బాలయ్య వస్తే, ఫ్యాన్స్ లో వచ్చే జోష్, సినిమాకు పెరిగే బజ్ కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈరోజు లేదా రేపు ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం వుంది.