Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గిరాకీ లేనివాళ్లే పవన్ తమ్ముళ్లా?

గిరాకీ లేనివాళ్లే పవన్ తమ్ముళ్లా?

పవర్ స్టార్ లాంటి పెద్ద స్టార్ లు సినిమాలు చేస్తే, అందులో పని మనిషి క్యారెక్టర్ కు కూడా కాస్తయినా ఇమేజ్ వున్న నటులనే తీసుకుంటారు. శంకర్ దాదాలో చిరుకు పక్కన సరైన అసోసియేట్ కోసం ఏకంగా హీరో శ్రీకాంత్ ను తీసుకున్నారు. ఇలా చాలా మంది పెద్ద హీరోలకు తమ్ముళ్లు కావాల్సినపుడల్లా కాస్త నోటెడ్ ఫేస్ లనే తీసుకోవడం అన్నది ట్రెడిషన్ గా మారింది. 

కానీ పవన్ కళ్యాణ్ తన తాజా సినిమాలో తమ్ముళ్ల కోసం తెగ వెదుకు లాడుతున్నారు. కాస్త ఇమేజ్ వున్న ఫేస్ లనే అనుకున్నారు కానీ సెట్ కాలేదు అని వినికిడి. ఆఖరికి ఇప్పుడు టాలీవుడ్ పోటీ ప్రపంచంలో చాన్స్ లు లేకుండా వెనుకబడిన శివబాలాజీ, కమల్ కామరాజులను ఎంపిక చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. 

వీరితో పాటు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్న అజయ్ ను కూడా ఓకె చేసారట. మరో చాయిస్ గా తాజగా ప్రేమమ్ సినిమాలో చైతూ పక్కన చేసిన యంగ్ నటుల్లో ఒకరని తీసుకుంటారట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?