సైన్స్ ఫిక్షన్ లో శిరీష్

శ్రీరస్తు శుభమస్తు సినిమా ఇచ్చిన కిక్ స్టార్ట్ తో లైన్ లోకి వచ్చాడు అల్లు శిరీష్. తరువాతి ప్రాజెక్టు ఓకె చేసాడుు. ఇప్పటికే మల్లిడి వేణు తో ఓ సినిమా చేయబోతున్నాడు. దాని స్క్రిప్ట్…

శ్రీరస్తు శుభమస్తు సినిమా ఇచ్చిన కిక్ స్టార్ట్ తో లైన్ లోకి వచ్చాడు అల్లు శిరీష్. తరువాతి ప్రాజెక్టు ఓకె చేసాడుు. ఇప్పటికే మల్లిడి వేణు తో ఓ సినిమా చేయబోతున్నాడు. దాని స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

అంతకన్నా ముందుగా టైగర్ సినిమా చేసి, ప్రస్తుతం నిఖిల్ తో సినిమా చేస్తున్న డైరక్టర్ ఆనంద్ తో ఓ ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నాడు త్వరలో. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్. ఆనంద్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయిట్లే. కాస్త పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వుంది. మాంచి సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్ చెప్పడంతో అల్లు అరవింద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

గతంలో స్వామిరారా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తారు.