Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గీతాకు దొరికే హీరో రామ్ యేనా?

గీతాకు దొరికే హీరో రామ్ యేనా?

టాక్సీవాలా సినిమా తీసిన రాహుల్ తో మళ్లీ మరో సినిమా ప్లాన్ చేస్తోంది గీతా 2 సంస్థ.ఈ బ్యానర్ మీద బన్నీవాస్,దర్శకుడు మారుతి,యువి వంశీ భాగస్వాములుగా టాక్సీవాలాను నిర్మించారు.మళ్లీ అదే విధంగా వారు ముగ్గురు తెరవెనుక నిర్మాణ భాగస్వాములుగా వుంటూ అదే డైరక్టర్ తో,అదే టీమ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. 

టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో తయారుచేసిన కథను ఓకె చేసారు.గీతా స్టయిల్ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.కానీ ఏ హీరో రెడీగా వున్నారు అన్నది పాయింట్.నాని బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు సినిమాలు ఫిక్స్ చేసుకుని వున్నారు.వాటిల్లో రాహుల్ సినిమా కూడా వుంది. సాయి ధరమ్ తేజ్ మరో రెండు మూడు ప్రాజెక్టులు చేయాల్సి వుంది.వరుణ్ తేజ్ సూట్ సెట్ కాకపోవచ్చు.

శర్వానంద్ యువిలో ఓ సినిమా చేయబోతున్నారు.శిరీష్ ను పెట్టి చేసే ధైర్యం చేయకపోవచ్చు.ఇక మిగిలింది రామ్ నే అని వినిపిస్తోంది.ప్రస్తుతం రామ్ చేస్తున్న సినిమా తరువాత ఆ సినిమా మీదకు రామ్ వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.రామ్ తో సినిమా గీతాలో ఒకటి వుండాలని స్రవంతి రవికిషోర్ కోరిక.అందుకే బహుశా ఈ కాంబినేషన్ సెట్ కావచ్చు అని తెలుస్తోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?