తెలంగాణలో హరితహారం.. ఆంధ్రప్రదేశ్‌లో వనం – మనం.. కాన్సెప్ట్ ఒకటే.. అదే మొక్కల పెంపకం. మొక్కల్ని పెంచండి, అవి వృక్షాలుగా మారి, మనకు మేలు చేస్తాయి. లక్షలు, కోట్ల సంఖ్యలు మొక్కలు నాటేయడానికి నడుం బిగించారు ఇద్దరు చంద్రులు. తెలంగాణలో ప్రారంభమైన హరితహారంలో సినీ గ్లామర్ అదిరిపోయింది. ఇప్పుడిక, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు వనం – మనం షురూ చేశారు. సో, టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఛలో విజయవాడ అనాలిప్పుడు.
కానీ, తెలుగు సినీ జనాలు విజయవాడకో, విశాఖపట్నంకో, తిరుపతికో 'వనం – మనం' కోసం పరుగులు పెడ్తారా.? స్వచ్ఛందంగా ముందడుగు వేస్తారా.? ఈ విషయమై ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడ్తోంది. చంద్రబాబు సర్కార్ తరఫున, టాలీవుడ్లో ఓ ప్రముఖ హీరో కుటుంబానికి పిలుపు అందిందట. అయితే, 'మాకేంటి.?' అంటూ ఆ హీరో నుంచి ప్రశ్న దూసుకొచ్చేసరికి, షాక్ గురవ్వాల్సి వచ్చిందట ఆహ్వానించినవారికి.
హీరోయిన్లు, హీరోలు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకొస్తారా.? ఏదో హైద్రాబాద్‌లో గనుక పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు, కాస్తంత టైమ్ చూసుకుంటే సరిపోతుంది. అదే విజయవాడ వెళ్ళాంటే కాస్తంత హంగామా అవసరం కదా. ఇక్కడే వస్తోంది చిక్కు అంతా. కానీ వెళ్ళకపోతే ఎలా.? బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అందుకే, ఏం చేయాలో కొందరికి అర్థం కాని పరిస్థితి.
హీరోయిన్లు, హీరోలు పోటీ పడి తెలంగాణ హరిత హారంలో పాల్గొన్నప్పుడు, ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ 'వనం – మనం' కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సిందే కదా. ముందే చెప్పుకున్నాం కదా, సమస్య.. కార్యక్రమంలో పాల్గొనడం కాదు, దానికోసం అక్కడిదాకా వెళ్ళడం. తెలుగు సినీ రంగానికి పెద్ద చిక్కే వచ్చి పడింది మరి.