Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొరటాల పెర్ ఫెక్ట్ ప్లానింగ్

కొరటాల పెర్ ఫెక్ట్ ప్లానింగ్

ప్లానింగ్ అంటే అలా వుండాలి. తన క్రియేటివిటీని, శక్తిని, చకచకా వాడుకుంటూ ముందుకు సాగాలి. ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివను అభినందించాల్సిందే. ఒక సినిమా ఫినిష్ అవుతుండగానే మరో సినిమా ప్లాన్ చేయడం, స్టార్ట్ చేయడం, అది కూడా వెల్ ప్లాన్డ్ గా ఫినిష్ చేయడం. 

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఇలా చకచకా చేసేసి, ఇప్పుడు మరోసారి మహేష్ సినిమాకు రెడీ అయిపోయారు. నిజానికి రామ్ చరణ్ తో సినిమా చేయాలి.కానీ చరణ్ తన చేతిలో ధృవ ఫినిష్ చేయాలి. ఆపై సుకుమార్ సినిమా చేయాలి. అంటే దాదాపు మరో ఏడాది. అందుకే కొరటాల శివ మహేష్ తో ఫిక్స్ అయిపోయారు. 

అంతే కాదు. డిసెంబర్ నుంచి షూట్ కు రెడీ అయిపోతున్నారు. దేవీనే మరోసారి మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్సయిపోయారు. మరి 2017లో కొరటాల శివతో ఎవరు రెడీ అవుతారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?