‘ఐ’ రిలీజ్ జనవరి 14న అని కన్ఫర్మ్ అయిపోవడంతో ‘గోపాల గోపాల’ యూనిట్‌కి ఇంకా టెన్షన్‌గా ఉంది. ‘ఐ’ని 15న రిలీజ్ చేయవచ్చునని ఊహాగానాలు సాగాయి కానీ 14నే వస్తుందని తేల్చేసారు. ఆ చిత్రంతో పోటీగా ‘గోపాల గోపాల’ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సాహసించడం లేదు. ఒకవేళ వారు రెడీగా ఉన్నా బయ్యర్లు ఒప్పుకోవడం లేదు.
తమిళంలో కూడా అజిత్, గౌతమ్ మీనన్‌ల చిత్రాన్ని వాయిదా వేసేసారంటే ‘ఐ’ గురించి మిగిలిన వాళ్లు ఎంత భయపడుతున్నారనేది అర్థమవుతోంది. డిఫరెంట్ మూవీ… క్రేజీ ప్రాజెక్ట్… ఇంటర్నేషనల్ లెవల్ మేకింగ్ వేల్యూస్.. అన్నిటికీ మించి శంకర్ బ్రాండ్ అందరినీ భయపెడుతోంది. కానీ ‘గోపాల గోపాల’ని సంక్రాంతికి తప్ప వేరే టైమ్‌లో రిలీజ్ చేయడం ఇష్టం లేక ఐతో వీలయినంత దూరం పాటించాలని చూస్తున్నారు.
ఈ శుక్రవారం విడుదల చేస్తే మంచిదని అనుకుంటున్నారు కానీ అప్పటికి సినిమా రెడీ అవుతుందా లేదా అని తేలలేదింకా. ఒకవేళ శుక్రవారం కుదరకపోతే శనివారం లేదా ఆదివారం అయినా ఈ చిత్రాన్ని విడుదల చేసేద్దామని చూస్తున్నారు. ఒక పెద్ద సినిమాని అలా ఎప్పుడు పడితే అప్పుడు విడుదల చేసేయాలని చూడడంతోనే ఐపై ఎంత భయం ఉందనేది అర్థమవుతోంది. ఎప్పుడు వచ్చినా కానీ ఐ మేనియాని ఈ చిత్రం ఎలా తట్టుకుంటుందనేది చూడాలి.