భారతీయ బాక్సాఫీస్ చరిత్రని తిరగరాసిన ‘పీకే’ వరల్డ్ వైడ్‌గా కూడా ఏ రికార్డుని మిగల్చలేదు. ఇండియాలో ధూమ్ 3 పేరిట ఉన్న రికార్డుని ఎప్పుడో అధిగమించిన ‘పీకే’ ప్రపంచ వ్యాప్తంగా ఆ చిత్రం నెలకొల్పిన రికార్డులని కూడా తుడిచి పెట్టేసింది. బాలీవుడ్‌కి సంబంధించి ఇప్పుడు అన్ని రికార్డులూ పీకే సొంతమయ్యాయి.
ఇండియాలో మూడొందల కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా సంచలనం సృష్టించిన పీకే ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల కోట్లు సాధించే దిశగా సాగిపోతోంది. ‘కంటెంట్ ఈజ్ కింగ్’ అనే సూత్రాన్ని ఈ చిత్రం నిజం చేస్తోంది. ఏవో హంగులతోనో, ఆర్భాటాలతోనో ప్రేక్షకులని థియేటర్లకి రాబట్టడం కాకుండా కేవలం కథకి ఉన్న బలంతోనే పీకే ఈ ఫీట్ సాధించింది.
మసాలా సినిమాలు మాత్రమే సేల్ అవుతాయనే భ్రమలని త్రీ ఇడియట్స్ తర్వాత పీకే ఇంకోసారి పటాపంచలు చేసింది. బాక్సాఫీస్ సింహాసనంపై మళ్లీ ఒక డిజర్వింగ్ ఫిలిం కూర్చున్నట్టయింది. బాలీవుడ్‌లో 100, 200, 300 కోట్ల క్లబ్‌లో ముందుగా చేరిన అమీర్‌ఖాన్ స్టార్‌డమ్‌కి క్వాలిటీ మూవీస్ యాడ్ అయితే ఏం జరుగుతుందనేది చేసి చూపిస్తున్నాడు. అతడిని చూసి అయినా మిగతా వాళ్లు కాస్త క్వాలిటీ మీద శ్రద్ధ పెడితే ఇలాంటి బ్లాక్‌బస్టర్లు రెగ్యులర్‌గా వస్తుంటాయి.