టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి బాయ్‌ఫ్రెండ్ దొరికేసాడని, అతనితో చెట్టపట్టాలు వేసుకుని తిరిగేస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఇంకాస్త అడ్వాన్స్ అయి కాజల్ పెళ్లి బాజా మోగనుందని కూడా ప్రచారం చేసేస్తున్నారు. కానీ కాజల్ మాత్రం తనకి అంత తీరిక లేదని చెప్తోంది.
‘‘బాయ్‌ఫ్రెండ్ ఉంటే ప్రత్యేకించి సమయం కేటాయించాలి. మన కెరీర్‌తో బిజీగా ఉంటూ స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయడం కష్టం. లవ్ అనేది డిమాండిరగ్ మేటర్ కనుక దానిని వెయిటింగ్‌లో పెట్టి ఇతర పనులు చూసుకోవడానికి ఉండదు. దాని వల్ల బంధం బలపడదు. సినిమా తారలకి స్ట్రాంగ్ లవ్ బాండ్ మెయింటైన్ చేయడమనేది చాలా కష్టం. మిగతా వారి సంగతి తెలీదు కానీ నేనైతే రెండు పడవలపై కాళ్లు వేయలేను’’ అని కాజల్ తేల్చేసింది.
తనకి ఇంకా తన పర్‌ఫెక్ట్ మ్యాన్ తారసపడలేదని, ఒకవేళ ఎదురు పడినా అతడిని గుర్తించే టైమ్ తనకి లేవని, ప్రస్తుతానికి కెరీర్‌తో హ్యాపీగా ఉన్నాను కనుక పెళ్లి గురించి ఆలోచించడం లేదని… ఇక్కడ ఖాళీ ఎక్కువ అయినప్పుడు జీవితంలో సెటిల్ అయ్యే దాని గురించి ఆలోచిస్తానని, అందాకా పెళ్లి పుకార్లకి ఫుల్‌స్టాప్ పెట్టమని మీడియాని రిక్వెస్ట్ చేసింది.