పోటీగా వస్తుందని అనుకున్న ‘టెంపర్’ రిలీజ్ వాయిదా పడడంతో ‘గోపాల గోపాల’ యూనిట్ తాపీగా సంక్రాంతికి వచ్చి సోలోగా పండగ చేసుకుందామని అనుకుంది. కానీ అనూహ్యంగా వారిపై శంకర్ ‘ఐ’ బాంబ్ విసిరాడు. ఎప్పుడయితే ‘ఐ’ రిలీజ్ సంక్రాంతికే అనే అనౌన్స్‌మెంట్ వచ్చిందో అప్పట్నుంచే ‘గోపాల గోపాల’ బృందానికి హై టెన్షన్ స్టార్ట్ అయింది.
ఎలాగైనా ఈ చిత్రాన్ని జనవరి 9కి విడుదల చేయాలని హడావుడి పడుతున్నారు. మరి అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేయగలరో లేదో అనేది చూడాలి. ఓవర్సీస్‌లో, బి అండ్ సి సెంటర్స్‌లో ఐ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. క్లాస్ మూవీ అయిన గోపాల గోపాలని అలాంటి పెద్ద స్పాన్, హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న చిత్రానికి పోటీగా విడుదల చేయడం కంటే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చూస్తున్నారు.
ఇప్పటికీ జనవరి 9కే విడుదల చేయడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కుదరని పక్షంలో పండక్కి ముందు… అంటే ఆదివారం నాడు అయినా రిలీజ్ చేయాలని, సరాసరి ఐతో పాటుగా పండక్కి మాత్రం విడుదల చేయరాదని ఫిక్సయ్యారు. మరి వారు పెట్టుకున్న టార్గెట్‌ని రీచ్ అయి, ఐ టెన్షన్‌నుంచి బయటపడతారో లేదో చూడాలి.