అసలే టాలీవుడ్ టైమ్ బాగా లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా కులసంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. దీనికి తోడు మతాల మనోభావాల సమస్య కూడా. అందకే గోపాల గోపాల టీమ్ ముందు జాగ్రత్త పడాలనుకుంటోందని వినికిడి.
పికె మీద హిందూ వ్యతిరేక భావజాలం అన్న సమస్య వచ్చింది. నిజానికి గోపాల గోపాల కూడా కాస్త అలాంటిదే. ఓ మైగాడ్ లో కూడా భగవంతుడు, భక్తుడు డిస్కషన్లు వున్నాయి. పికె ద్వితీయార్థం కూడా ఇలాంటిదే. పికె పై ఇప్పడు పీకల్లోతు వివాదాలు చెలరేగుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ జనాలు గోపాల గోపాల మీద కూడా కన్నేసి వున్నారని చిన్న గుసగుస వినిపిస్తోంది.
అందుకే ఎందుకొచ్చిన వివాదం అని సినిమాను విహెచ్పీ జనాలకు ఓసారి చూపించేసి, అప్పుడు విడుదల చేద్దామని అనుకుంటున్నారట నిర్మాత సురేష్ బాబు. అయినా సురేష్ బాబు అనుకోవడం సరే కానీ, భాజపా మిత్రుడు పవన్ వున్న సినిమాను విహెచ్ పి వాళ్లు మాత్రం ఎందుకు అడ్డుకుంటారంటారా?