‘గోపాల..’పై వివాదం మొదలైంది

ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు, టైటిల్‌ దగ్గర్నుంచే వివాదాలు మొదలవుతున్నాయి. ఈ వివాదాల పుణ్యమా అని క్రియేటివ్‌ పీపుల్‌కి ఎలాంటి సినిమా తీయాలో అర్థం కాని అయోమయం ఎదురవుతోంది ప్రతిసారీ. సినిమాల్లోని పాత్రలకు ఆయా…

ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు, టైటిల్‌ దగ్గర్నుంచే వివాదాలు మొదలవుతున్నాయి. ఈ వివాదాల పుణ్యమా అని క్రియేటివ్‌ పీపుల్‌కి ఎలాంటి సినిమా తీయాలో అర్థం కాని అయోమయం ఎదురవుతోంది ప్రతిసారీ. సినిమాల్లోని పాత్రలకు ఆయా కులాల్నీ, మతాల్నీ ఆపాదించి వివాదాలు సృష్టించడం సాధారణ విషయంగా మారిపోయింది. అలాంటి వివాదాలు ఒక్కోసారి సినిమాని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి కూడా.

ఇక తాజాగా ‘గోపాల గోపాల’ సినిమా వివాదాల సుడి గుండంలో ఇరుక్కుపోయింది. సినిమాకి సెన్సార్‌ బోర్డ్‌ అనుమతివ్వరాదంటూ వీహెచ్‌పీ ఆందోళన చేపట్టింది. హిందువుల మనోభావాల్ని కించపర్చేలా సినిమాలో సన్నివేశాలున్నాయన్నది వీహెచ్‌పీ ఆరోపణ. ప్రస్తుతం వీహెచ్‌పీ, బాలీవుడ్‌ మూవీ ‘పీకే’ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న విషయం విదితమే. బాలీవుడ్‌లో హిట్టయిన ‘ఓ మై గాడ్‌’కి ‘గోపాల గోపాల’ తెలుగు రీమేక్‌.

సో.. ‘గోపాల గోపాల’ కంటెంట్‌ ఏంటో అందరికీ తెలుసు. ‘ఓ మై గాడ్‌’ బాలీవుడ్‌లోనే అనేక వివాదాల్ని ఎదుర్కొన్నా, విజయవంతమయ్యింది. ‘పీకే’ వివాదంతో వీహెచ్‌పీ పూర్తిస్థాయిలో యాక్టివ్‌ అయిన దరిమిలా, ‘గోపాల గోపాల’ సినిమాకి ఇబ్బందులు ముందు ముందు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం వుంది.

ఏం వివాదాలో ఏంటోగానీ, వివాదాల పేరు చెప్పి ఆయా సంస్థలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తుండడం హర్షణీయం కాదు. అదే సమయంలో, క్రియేటివ్‌ పీపుల్‌.. వివాదాస్పద అంశాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే మంచిది.