వరుసగా భారీ చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో కాస్త మీడియం రేంజ్ సినిమాల్ని ఈ రద్దీలో కాకుండా పెద్దగా సందడి లేని టైమ్‌లో రిలీజ్ చేస్తే బెటరని నిర్మాతలు తమ చిత్రాల్ని వాయిదా వేసుకుంటున్నారు. బిజినెస్ బ్రహ్మాండంగా జరిగిపోయినా, మిగిలిన సినిమాలకంటే డిఫరెంట్ జోనర్ అయినా కానీ నాగార్జున తెలివిగా ‘ఒక లైలా కోసం’ రిలీజ్ వాయిదా వేసాడు.
కానీ గోపీచంద్ సినిమాని మాత్రం ఈ రద్దీలోనే విడుదల చేయడానికి ఫిక్సయ్యారు. ‘లౌక్యం’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 26న రిలీజ్ చేస్తారట. అంటే ఆగడుకి సరిగ్గా వారం తర్వాత, గోవిందుడు అందరివాడేలేకి అయిదు రోజుల ముందు ఇది రాబోతోందన్నమాట. ఇదేమి లౌక్యమని అనుకుంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
అసలే డౌన్‌లో ఉన్న గోపీచంద్‌తో ఇప్పుడు పెద్ద సినిమాల్తో తొడ కొట్టించడం అవసరమా అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. సినిమా డీసెంట్‌గా ఉన్నా కానీ రెండు జయంట్ రిలీజ్‌ల మధ్య లౌక్యం అన్‌నోటీస్డ్‌గా వెళ్లిపోయే ప్రమాదముంది. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు కానీ దీనికి స్టిక్ అవుతారని అనుకోడానికి లేదు. ఆగడు బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆటోమేటిగ్గా చాలా మంది ప్లాన్స్‌లో మార్పులు జరుగుతాయి.