‘రభస’ కూడా యావరేజ్ టు బిలో యావరేజ్ టాక్‌తో కమర్షియల్‌గా డిజప్పాయింట్ చేసే దిశగా సాగిపోతుండగా… ఎన్టీఆర్ ఛాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ మరోసారి హైలైట్ అయింది. హిట్ సినిమాలు తీసిన దర్శకుల్ని వెంటాడే తన ధోరణి ఎన్టీఆర్‌కి మళ్లీ చేదు అనుభవాన్నిచ్చింది. రామయ్యా వస్తావయ్యా తర్వాత రభస కూడా ఎన్టీఆర్ స్థాయికి తగ్గ సినిమా అనిపించుకోలేకపోయింది.
అదే మూస పాత్రలు, ఎలాంటి వైవిధ్యం లేని స్క్రిప్టులు ఎన్టీఆర్‌ని పోటీలో వెనక్కి నెడుతున్నాయి. అర్జంటుగా తనకి రొటీన్ నుంచి బ్రేక్ అవసరం. మంచో, చెడో.. ఈ టైమ్‌లో ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ సినిమా చేస్తున్నాడు. పూరితో సక్సెస్ గ్యారెంటీ తక్కువైనా కానీ కనీసం మూస ధోరణులకి భిన్నంగా చేస్తుంటాడు. శ్రీను వైట్ల బ్రాండ్ కామెడీలు, రివెంజ్ డ్రామాలు కాకుండా హీరోని కొత్తగా చూపించడానికి ట్రై చేస్తాడు.
ఎన్టీఆర్‌కి ఈ టైమ్‌లో హిట్ కంటే మొనాటనీ నుంచి బ్రేక్ అవసరమని సినీ విశ్లేషకులు ముక్త కంఠంతో అభిప్రాయపడుతున్నారు. పూరి జగన్నాథ్ సినిమాతో అది జరుగుతుందని, ఎన్టీఆర్ ఇమేజ్‌ని బేస్ చేసుకుని కాకుండా తనదైన శైలిలో అతడిని ప్రెజెంట్ చేసి కాస్త వెరైటీని చూపిస్తాడని అనుకుంటున్నారు. పూరితో సినిమా అంటే వేగంగా పూర్తయిపోతుంది కనుక రభస భారాన్ని త్వరగా మర్చిపోవడానికీ ఆస్కారముంటుంది.