ప్రభాస్ తలకు గాయమైందా? కొన్ని వారాల పాటు షూటింగ్‌కు దూరం కావాలని నిర్ణయిచుకొన్నాడా? బాహుబలి సినిమాని మధ్యలో ఆపేద్దాం అన్నాడా.?? ఇలా ఎన్నో పుకార్లు షికారు చేస్తున్నాయి. బాహుబలి షూటింగ్ సమయంలో ప్రబాస్ కి గాయమైందనే దుమారం భీమవరం అంతా వ్యాపించింది. ప్రభాస్ అభిమానులంతా ఒకచోట చేరుకొని.. ఈ విషయం గురించి ఆరా తీయడం మొదలెట్టారు.
ప్రభాస్కి ఇప్పుడు ఎలా ఉంది?? ఎప్పుడు కోలుకొంటాడు?? అంటూ పిల్మ్‌నగర్‌లో తమకు తెలిసిన పెద్దలకు ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది బాహుబలి విషయంలో, ప్రబాస్ విషయంలో అత్యుత్యాహం ప్రదర్శిస్తూ ప్రభాస్ గురించి రకరకాల పుకార్లు సృష్టిస్తున్నారు.
దాంతో యంగ్ రెబల్ స్టార్ అభిమానుల్లో అందోళనలు చెలరేగుతున్నాయి. ప్రభాస్ దిగి వచ్చి.. ఓ స్టేట్‌మెంట్ ఇస్తే తప్ప, ఈ పుకార్లు ఆగేలా లేవు.