ఒక్క టీజర్ తో సంపత్ నంది – గోపీచంద్ కాంబినేషన్ లోని గౌతమ్ నందా కు ఎక్కడ లేని బజ్ వచ్చేసింది. దాంతో బిజినెస్ అందుకుంది. బెంగాల్ టైగర్ ట్రాక్ రికార్డు కూడా ఇందుకు తోడయింది.
బెంగాల్ టైగర్ ను దాదాపు అన్నీ కలిపి ముఫై నుంచి ముఫై రెండు వరకు మార్కెట్ చేసారు. వర్తమానానికి వస్తే, గౌతమ్ నందా ఆంధ్ర హక్కులు 9.5 కోట్ల రేంజ్ లో అమ్ముడుపోయాయి.
ఇదే ఈక్వేషన్ లో సీడెడ్, నైజాం బిజినెస్ ల డిస్కషన్లు నడుస్తున్నాయి. అంటే గౌతమ్ నందా వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ నే ముఫై దాటే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే మంచి రేటుకు హిందీ డబ్బింగ్ రైట్స్ ఇచ్చేసారని టాక్ వినిపిస్తోంది. శాటిలైట్ ఎలాగూ వుంటుంది. అంటే గోపీచంద్ కు, సంపత్ నందికి కూడా నలభై కోట్ల మార్కెట్ మార్కును అందుకునే అవకాశం వచ్చింది గౌతమ్ నందాతో.
గతంలో రచ్చ సినిమాతో అన్నీ కలిపి యాభై కోట్ల మార్కును అందుకున్నా, అది హీరో రామ్ చరణ్ ఖాతాలోకి పోయింది. ఇప్పుడు మాత్రం గౌతమ్ నందా క్రెడిట్ మాగ్జిమమ్ సంపత్ నంది ఖాతాలోకే వస్తుంది.
అన్నట్లు ఈ సినిమాతో మరో హిట్ కొడితే, గతంలోనే ఓకె చేసిన లైన్ తో సినిమా చేయడానికి రామ్ చరణ్ రెడీగా వున్నాడట.