మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. మేమిద్దరం విడిపోతున్నాం.. ఈ ప్రకటనలకు పెద్దగా విలువ వుండదు. సెలబ్రిటీలు గనుక, ఏదో గాసిప్స్ కాలమ్‌కి మాత్రమే ఇలాంటివి పరిమితమవుతుంటాయి. సహజీవనం కూడా అంతే. దానికి గుర్తింపు లేదు. కాబట్టి, సహజీవనం చేస్తున్నా.. ఆ సహజీవనానికి బ్రేకప్ చెప్పేసి విడిపోయినా అది పెద్ద మేటర్ కానే కాదు. కానీ, సినీ నటి గౌతమి, కమల్‌హాసన్‌తో విడిపోతున్నట్లు ప్రకటించి పెద్ద దుమారమే రేపింది.
ఒకప్పుడు గౌతమి ప్రముఖ నటి. ఇప్పుడు మాత్రం చాలా అరుదుగానే ఆమె సినిమాల్లో కన్పిస్తోంది. కమల్‌తో సహజీవనం చేస్తోంది గనుక, మీడియాలో గౌతమికి కాస్తో కూస్తో పాపులారిటీ దక్కుతోందనేవారూ లేకపోలేదు. అందుకనే, కమల్ పేరు చెప్పి గౌతమి పబ్లిసిటీ స్టంట్లు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోపక్క, కమల్‌తో విడిపోతున్నట్లు ప్రకటించడం ద్వారా గౌతమి, శృతిహాసన్‌ని పరోక్షంగా కార్నర్ చేసేసింది.
'వాళ్ళిద్దరూ విడిపోయారు.. మధ్యలో నన్ను లాగుతున్నారెందుకు.?' అంటూ శృతిహాసన్ వాపోతోందిప్పుడు. కమల్, శృతి కలిసి నటిస్తున్న 'శభాష్‌నాయుడు' సినిమా వివాదమే కమల్ – గౌతమి మధ్య విభేదాలకు కారణమనీ, శృతిహాసన్ ఆ ఇద్దరి మధ్యా చిచ్చుపెట్టిందనీ, గౌతమి బ్రేకప్ లెటర్ తర్వాత విశేషణలు మొదలయ్యాయి. దాంతో హర్ట్ అయిన శృతిహాసన్, మీడియాకి వివరణ ఇచ్చే ప్రయత్నాల్లో వుందట. ఏ విషయాన్ని అయినా కుండబద్దలుగొట్టేయడం ఆమెకు అలవాటు మరి.
అయితే, ఇప్పుడు అనవసరంగా వివరణ ఇచ్చి వివాదాన్ని పెద్దది చేయడం మంచి కాదంటూ శృతిహాసన్‌కి ఆమె సోదరి అక్షరహాసన్ సలహా ఇచ్చిందట. మరెలా, ఈ వివాదం నుంచి బయటపడేదెలా.? శృతిహాసన్ ఈ ప్రశ్నకు సమాధానం తెలియక విలవిల్లాడుతోందట. ఇంతకీ, గౌతమి ఎందుకిలా చేసింది.? శృతిహాసన్‌తో విభేదాలను ఫోకస్ చేయడానికి గౌతమి 'బ్రేకప్' వ్యవహారాన్ని వాడుకోవడమేంటి.? ఆమెకే తెలియాలి.